ఇసుక కొరతపై సీఎం జగన్‌కు శనివారం సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. గత 4 నెలలకుపైగా ఇసుక సమస్య కొనసాగుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారని పేర్కొన్నారు. ఇసుక సమస్యకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.20వేలు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.