Idream media
Idream media
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాటలు, ఆరోపణలు కొంత కాలంగా విమర్శలపాలవుతున్నాయి. పార్టీ లక్ష్యాలు వదిలేసి టీడీపీకి ఒత్తాసుపలికేలా ఉంటున్నాయన్న వాదన బలపడుతోంది. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటినీ విమర్శించడంతో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇళ్ల స్థలాల విషయంలోనూ ఆయన పంథా అనుమానాలను రేకెత్తిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయడుతో మిలాఖత్ అయ్యారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక రకంగా చూస్తే టీడీపీ, సీపీఐ రెండూ ఒకే బాటలో పయనిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేనతో సీపీఐ చేతులు కలిపింది. జనసేన – బీజేపీకి చేరువయ్యే సరికి ప్రస్తుతం ఒంటరిదైంది. బలమైన పార్టీ అండ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సీపీఐ నారాయణ అలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న టీడీపీ, సీపీఐ పార్టీల పంథా ఒకేలా ఉండడమే ఇందుకు నిదర్శనం. స్థానిక ఎన్నికలకు విషయంలో కూడా సీపీఐ అలానే వ్యవహరించింది. మరో కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఎం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెబితే.. సీపీఐ మాత్రం తెలుగుదేశం వెలిబుచ్చిన అభిప్రాయానికి అనుగుణంగానే వ్యవహరించింది.
చంద్రబాబుకు లొంగిపో్యారు..
ఇప్పుడు ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచీ టీడీపీ నాయకులు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా సీపీఐ నారాయణ కూడా వారికి జత కట్టారు. దీంతో ఇళ్ల స్థలాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తప్పుపట్టారు. సీపీఐ నేత నారాయణ తనకు మంచి మిత్రుడని, కానీ ఆయన చంద్రబాబు నాయుడుకి లొంగిపోయి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీపీఐ పార్టీనీ చంద్రబాబుకు ఎప్పుడో అమ్మేశారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. పేదలకు ఇస్తున్న స్థలం కుక్కల దొడ్డి అంత లేదనడం నారాయణ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇళ్ల స్థలం తీసుకున్న పేదల దగ్గరకు వెళ్లి నారాయణ ఆ మాటలు అనాలని సవాల్ విసిరారు. పేదల సంతృప్తే తమ ప్రభుత్వానికి ముఖ్యమని తెలిపారు. లోకేష్ మాటలకు అయితే తాను స్పందించాల్సిన అవసరమే లేదన్నారు. తెలుగుదేశం పార్టీకి బేస్‌మెంట్ కదిలిపోయిందని, ఆ పార్టీని కాపాడుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు.