iDreamPost
android-app
ios-app

ఆర్నెళ్ళ తరువాతే వ్యాక్సిన్‌.. అప్పడు కూడా..

  • Published Sep 14, 2020 | 12:41 PM Updated Updated Sep 14, 2020 | 12:41 PM
ఆర్నెళ్ళ తరువాతే వ్యాక్సిన్‌.. అప్పడు కూడా..

మానవ జీవితాలను తీవ్ర అతాకుతలం చేస్తున్న కోవిడ్‌ 19కు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్నెళ్ళ తరువాత గానీ వ్యాక్సిన్‌ వచ్చేందుకు అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్‌ ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపై క్లారిటీ వచ్చినట్లైంది. 2021 మొదటి త్రైమాసికంలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది చివరికల్లా వ్యాక్సిన్‌ వచ్చేస్తోందన్న వార్తలకు అడ్డుకట్ట పడ్డటై్టంది.

ఇదిలా ఉండగా వ్యాక్సిన్‌ వచ్చినా రాకపోయినా వ్యక్తిగతంగా జాగ్రత్త వహించాలన్న వాదనకు బలం చేకూరుతోంది. వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ ముందుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి.. ఇలా ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు అవకాశాలెక్కువ. ఈ నేపథ్యంలో కోవిడ్‌ భారిన పడకుండా తప్పని సరి జాగ్రత్తలను పాటించడం ద్వారా ఇప్పటికిప్పుడు ఏర్పడే ముప్పును తప్పించుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలు అందరికీ కోవిడ్‌ 19 పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో మొత్తం 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్ర మంత్రులకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. కాగా ఇప్పటి వరకు మొత్తం దేశ వ్యాప్తంగా నభై ఎనిమిదిన్నర లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో తొంభైరెండువేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.