iDreamPost
android-app
ios-app

భార్య మృతి కేసులో శశి థరూర్ కు క్లిన్ చిట్….

భార్య మృతి  కేసులో శశి థరూర్ కు క్లిన్ చిట్….

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు భారీ ఊరట లభించింది తన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఏడేళ్ల నరకం నుండి రిలీఫ్ దొరికిందని శశిథరూర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ 54ఏళ్ల వయసులో 48 ఏళ్ల సునందా పుష్కర్ ను 2010లో మలయాళ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. దుబాయిలో కేంద్రంగా సునందా పుష్కర్ బిజినెస్ చూసుకుంటుంది. అయితే 17 జనవరి 2014 ఢిల్లీ చాణక్య పురిలోని లీలా ప్యాలెస్ లో రూమ్ నెంబర్.345లో అనుమానాస్పదంగా మృతి చెందింది. మొదట ఆత్మహత్యగా కేసునమోదు చేసినా పోలీసులు తరువాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పర్సనల్ అసిస్టెంట్ నారాయణ సింగ్ డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ ధావన్‌లను పోలీసులు విచారించి పలు విషయాలు సేకరించారు. తరువాత ఈ కేసుకు సంబంధించి శశి థరూర్ పై ఐపీసీ సెక్షన్ 498 ఎ (వైవాహిక క్రూరత్వం) మరియు 306 (ఆత్మహత్యకు ప్రేరణ) సెక్షన్ల కింద శశి థరూర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. చార్జిషీట్‌లో కూడా చేర్చారు.

సునందా మృతికి శశిథరూర్ కారణం అని మీడియాలో పెద్ద దుమారం రేగింది. ఆమె మృతికి డ్రగ్స్ కారణం అని , హత్య , ఆత్మహత్య అనే విషయంలో పెద్ద చర్చ జరిగింది.

“భార్య సునంద పుష్కర్ ను ఆత్మహత్య చేసుకునేలా శశిథరూర్ ప్రేరేపించారని, అతనే ఆమె మరణానికి కారణమనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీ ప్రత్యేక కోర్టు సునంద పుష్కర్ కేసును మరోసారి విచారించింది.ఈ కేసులో శశి థరూర్ తరపున సీనియర్ అడ్వకేట్ వికాశ్ పాహ్వా హాజరై.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి సునందా హత్యకేసుతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి వాదించారు.ఇరుపక్షాల వాదనలు విన్న స్పెషల్ జడ్జి జస్టిస్ గీతాంజలి గోయల్ “భార్య సునంద పుష్కర్ కేసులో శశిథరూర్ మీద నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది.

కోర్టు క్లిన్ చిట్ ఇవ్వడంతో 7ఏళ్ళు నరకం అనుభవించనని శశిథరూర్ తెలిపారు. ఈఏడేళ్ళు మానసిక ప్రశాంతత కోల్పోయనని ఆవేదన వ్యక్తంచేశారు.. ఎట్టకేలకు ఈ కేసులో క్లిన్ చిట్ రావడంతో శశిథరూర్ ఊపిరి పీల్చుకుంటున్నారు. శశిథరూర్ ప్రస్తుతం తిరువనంతపురం నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.