iDreamPost
android-app
ios-app

మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతదేహానికి కరోనా పాజిటివ్

మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతదేహానికి కరోనా పాజిటివ్

మొద్దు శ్రీను హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓం ప్రకాశ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాష్ కు కొద్దిరోజులుగా డయాలసిస్ నిర్వహిస్తున్నారు. తొలుత కిడ్నీ సమస్యలతో ప్రాణాలు కోల్పోయాడని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఓం ప్రకాష్ ప్రైమరీ సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

శనివారం రాత్రి ఓం ప్రకాశ్ కు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్తింద‌ని దాంతో వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించామని, చికిత్స పొందుతుండగానే ఓం ప్రకాశ్ మృతి చెందాడని జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. కాగా ఓం ప్రకాష్ మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్దారణ అయిందని, కాబట్టి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే అతని అంత్యక్రియలు విశాఖలో జరుగుతాయని జైలు సూపరింటెండెంట్ రాహుల్ వెల్లడించారు.

2008 నవంబరు 9న పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొద్దు శ్రీనును, ఓం ప్రకాష్ డంబుల్‌తో కొట్టి హత్య చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణలో మొద్దు శ్రీనును హత్య చేసినట్లు రుజువు కావడంతో అనంతపురం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓం ప్రకాష్ కి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇవ్వడంతో 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఓం ప్రకాశ్ శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాష్ కు డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఓం ప్రకాష్ కాంటాక్టులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.