కరోనా వైరస్ ఫ్రీ కంట్రీగా ఉన్న న్యూజిలాండ్‌లో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పూర్తిగా కరోనా వైరస్ ను నిరోధించిన దేశంగా న్యూజిలాండ్ రికార్డ్ సృష్టించింది. తాజాగా నలుగురుకి కరోనా సోకినట్లు నిర్దారణ అవడంతో మళ్ళీ కరోనా కేసుల కలకలం న్యూజిలాండ్ లో మొదలైంది.
వివరాల్లోకి వెళితే 102 రోజుల క్రితం న్యూజిలాండ్ వైరస్ ఫ్రీ కంట్రీగా అవతరించింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సగర్వంగా ప్రకటించారు. తాజాగా ఆక్లాండ్ లోని ఒక కుటుంబంలో నలుగురికి కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఇప్పటివరకూ దేశంలో కట్టడి అయిన కరోనా వైరస్ మరోసారి దేశంలో కనిపించడంతో ఆ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో నలుగురికి కరోనా వైరస్ మళ్ళీ నిర్దారణ అయిన నేపథ్యంలో ఆక్లాండ్ నగరంలో లాక్‌డౌన్ విధించారు. కరోనాను కట్టడి చేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. వారికి కరోనా ఎలా సోకిందో తెలియదని కరోనా వైరస్ మూలాలు కనిపెడుతున్నామని ప్రధాని వెల్లడించారు.