iDreamPost
android-app
ios-app

కరోనా ఎఫెక్ట్ – సినిమా థియేటర్లు మూతపడనున్నాయా?

కరోనా ఎఫెక్ట్ – సినిమా థియేటర్లు మూతపడనున్నాయా?

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచం మొత్తాన్ని భయపెడుతోంది. క‌రోనా వ‌ల్ల స్టాక్ మార్కెట్లు అంత‌కంతకు ప‌డిపోతుండగా బిజినెస్ రంగాల‌లో తీవ్ర న‌ష్టాలు వ‌స్తున్నాయి. దాదాపుగా చాలా దేశాల్లో మాల్స్‌, సినిమా థియేట‌ర్లకు జ‌నం వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. క‌రోనా ఎఫెక్ట్ బాలీవుడ్ పై వారం క్రితమే ప‌డింది. దీంతో షూటింగ్ లు ఆగిపోవడం, న‌త్త‌న‌డ‌క‌న సాగుతుండడం వల్ల నిర్మాత‌ల‌కి త‌ల‌కి మించిన భారం అవుతుంది. ఇలా ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా క్రమక్రమంగా మన ప్రాంతంలోకీ ఎంటరయ్యింది. ఇప్పుడైతే ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ కరోనా కలకలం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లో కరోనా క్రమక్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. ఇందులోభాగంగా సినిమా షూటింగ్ లతో పాటు సినిమా హాళ్లను కూడా కొంతకాలం ఆపేయాలని, సినీ పరిశ్రమకు చెందినవారంతా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతలు తీసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. ఈమేరకు గురువారం లేదా శుక్రవారం మీడియా ముందుకు రానున్నారట. హైదరాబాద్ తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ షూటింగ్ చేస్తున్నవారంతా ఉన్నపళంగా బంద్ చేసి కొంతకాలం బ్రేకివ్వాలని సూచించనున్నారు. కొంతకాలంపాటు కెమెరా ఆఫ్ చేయనున్నారు. షూటింగ్ పేరుతో ఎవరూ కొన్నాళ్లు విదేశాలకు వెళ్ళకుండా ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు కీలక సినిమాల షూటింగ్ లన్నీ ఆపేసినట్టు సమాచారం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా దీనిపై చర్చించే అవకాశం ఉంది.

ప్రభుత్వం కూడా ఇండస్ట్రీనుంచి సహకారం అడిగితే ముందకెళ్లాలని లేదా ప్రభుత్వంతో కలిసి తామే ముందుకు కదిలేలా యోచించనున్నారు. అయితే గతంతో పోల్చితే తమిళనాడు నటులంతా వేగంగా మన ఇండస్ట్రీ స్పందించేది కాదు. హుదూద్ కు ముందువరకూ ఇండస్ట్రీ నుంచి ప్రజలకోసం స్పందించిన సందర్భాలు చాలా తక్కువ.. అయితే సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోతుండడం ప్రజల్లోనూ ప్రశ్నించేతత్వం రావడంతో ఇండస్ట్రీ వర్గాలను ముఖ్యంగా హీరోలను నిలదీసేవాళ్లు ఎక్కువైపోయారు. గతంలో దిశ హత్యోదంతంపై ఇండస్ట్రీలోని ప్రతీహీరో స్పందించి, తమ నిరసనను వ్యక్తం చేసేవారకూ నెటిజన్లు వదిలిపెట్టలేదు. అయితే స్పందిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి.. ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి.. లేదా స్పందిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే చాలామంది ఆచితూచి అడుగులేస్తుంటామని ఓ సందర్భంలో శివాజీరాజా అన్నారు.

మొత్తమ్మీద తెలుగు సినీ పరిశ్రమ నుండి ఓ ప్రాణాంతక వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు అడుగులు పడడం ఓ శుభ పరిణామంగా చెప్పుకోవాలి.