iDreamPost
android-app
ios-app

ఏపీలో 161 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో 161 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 161 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,460 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  వెల్లడించింది. కాగా  2,323 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1192గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 73 మంది మరణించారు.

గడచిన 24 గంటల్లో 29 మంది కోవిడ్19 నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారని, మరణాలు సంభవించలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 12,771 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో 161 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కాగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 49మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దానితో మొత్తం కేసులు 210 గా నిర్దారణ అయ్యాయి.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobetJojobet Giriş