దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకగా, రాజ్ భవన్ లో పనిచేసే నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా సెగ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని తాకింది. సుప్రీం కోర్టులో పనిచేసే రిజిస్ట్రార్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఏప్రిల్ 16న కోర్టుకు వచ్చి విధులు నిర్వహించిన ఆయన తర్వాత రెండు రోజులు జ్వరంతో బాధపడ్డాడు. దీంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో పాటు పనిచేసిన ఇద్దరు రిజిస్ట్రార్లను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు.
నీతి ఆయోగ్‌లో పనిచేసే ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా నిర్దారణ అయినట్లుగా అధికారులు ట్విటర్‌లో వెల్లడించారు.నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో కార్యాలయాన్ని 48గంటల పాటు మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. నీతి ఆయోగ్ ఉద్యోగి ఎవరెవరిని కలిసాడనేదానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇప్పటికే దేశంలో 29,663మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా,940 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. 7,176 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు..