Idream media
Idream media
రోజులు గడిచే కొద్దీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ రోజు సాయంత్రం నాటికి కరోనా పాజిటివ్ కేసులు 3 వేలు దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 3,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇప్పటి వరకు 75 మంది భారతీయులు మృతి చెందారు. వైరస్ ప్రభావం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువగా ఉంది. ఈ ఒక్క రోజే 52 కరోనా కేసులు. రెండు మరణాలు ముంబైలో నమోదు అయ్యాయి.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 11,40,598 మందికి కరోనా సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మహమ్మారి వల్ల 61,188 మంది చనిపోయారు. 2,36,528 మంది కరోనా నుంచి కోలుకోవడం ఉపశమనం కలిగించే అంశం. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 8,42,882 కాగా అందులోఅమెరికాలోనే 278,960 నమోదు అవ్వడం కరోనా ప్రభావం అగ్ర రాజ్యం పై ఏ విధంగా పంజా విసిరుతుందో తెలుసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 14వ తేదీన ముగిసే లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ సాగుతోంది. దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మొన్న సీఎంలతో జరిగిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు. దేశంలో 3,072 మందికి కరోనా సోకింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తి వేత ఎలా జరుగుతుంది..? ఆంక్షలు ఎలాఉండబోతున్నయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత నెల 25వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్ అమలవుతోంది.