ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఆ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజా నరసింహ మీడియా తో మాట్లాడారు. కార్మికుల ను తొలగిస్తున్నాం… కొత్త వారిని నియమిస్తాం అని సీఎం కేసీఆర్ అహాంకార పూరితంగా మాట్లాడారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
బేషజాలకు పోకుండా కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 19 లోపు సమస్య పరిస్కహరించాలని, లేదంటే 21న రాష్ట్ర బంద్ చేస్తామని హెచ్చరించారు. ‘గత నెల ప్రగతి భవన్ లో హస్కి అనే కుక్క చనిపోయిందని సంబందిత డాక్టర్‌కు 5 ఏళ్ల శిక్ష పడేలా కేసు నమోదు చేశారు. కుక్కకు ఉన్న విలువ మనిషికి లేదా. కార్మికులెరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది’ అని రేవంత్ భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం కార్మికులతో డబుల్ గేమ్ ఆడుతోందని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘సీఎం మీ ఉద్యోగాలు పోయినయి అంటరు. మంత్రులు ఉద్యోగాలలో చేరాలని అంటరు. ఈ డబుల్ గేమ్ ఏంది. మోటార్ సైకిల్ తోలరానోనికి బస్సు ఇస్తే.. వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తున్నరు. కేకే మధ్యవర్తిత్వం వహిస్తా అంటున్నారు. సీఎం ఆదేశాల మేరకే
దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి దొర పాలన లేదని దామోదర రాజా నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలకు స్వేచ్ఛ నిచ్చింది. కేంద్రం ఆర్టీసీ సమస్యపై స్పందించాలి. ఢిల్లీ కి వెళ్లిన గవర్నర్, కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపుతురాని ఆశిస్తున్నాం.’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.