iDreamPost
android-app
ios-app

అభిమానుల డౌట్లు తీర్చినట్టేనా ?

  • Published Sep 19, 2022 | 5:07 PM Updated Updated Sep 19, 2022 | 5:07 PM
అభిమానుల డౌట్లు తీర్చినట్టేనా ?

అసలు ప్రమోషన్ల ఊసే లేకుండా డల్ గా కనిపిస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదని మెగా కాంపౌండ్ లేటెస్ట్ అప్ డేట్. ఇప్పటిదాకా పబ్లిసిటీపరంగా యాక్టివ్ నెస్ కనిపించకపోవడంతో వాయిదా తప్పదేమోనని టెన్షన్ పడుతున్న అభిమానులకు ఊరట కలిగించబోతున్నట్టు తెలిసింది. ఈ నెల 25 అనంతపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తేదీ కొంచెం అటు ఇటు మారినా చేయడం మాత్రం కన్ఫర్మ్ అట. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చేది లేనిది రెండు మూడు రోజుల్లో తెలిసే ఛాన్స్ ఉంది.

మొన్న వదులుతామని చెప్పి ఆపేసిన తక్కర్ మార్ లిరికల్ వీడియోతో మొదలుపెట్టి వారం గ్యాప్ లో సినిమాలో ఉన్న మూడు పాటలను రిలీజ్ చేయబోతున్నట్టు మరో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. చేతిలో ఉన్నది కేవలం 15 రోజులే. ఇది చాలా తక్కువ టైం. పరుగులు పెడితే కానీ ఓపెనింగ్స్ టైంకి బజ్ ని అమాంతం పెంచలేం. ఎంత చిరంజీవి బొమ్మ అయినా ఇది 90ల నాటి కాలం కాదు. ఆచార్యకు ఏం జరిగిందో ఇంకా ఎవరు మర్చిపోలేదు. గాడ్ ఫాదర్ లో ఆల్రెడీ మలయాళం నుంచి తీసుకున్న ప్రూవ్డ్ కంటెంట్ ఉన్నా ఈ అలసత్వం ఎంత మాత్రం మంచిది కాదు. రోజుకో అప్డేట్ ఇస్తూ పొతే తప్ప దసరానాటికి ఫ్యాన్స్ తో సహా సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కలుగుతుంది.

తమన్ వైపు నుంచి జరగాల్సిన రీ రికార్డింగ్ పనులు కొంత లేట్ అవుతున్నాయని, అవి పూర్తవ్వగానే ఆఘమేఘాల మీద సెన్సార్ చేయించేసి ట్రైలర్ కట్ తో పాటు ఇతరత్రా కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొణిదెల, సూపర్ గుడ్ సంస్థల టీమ్ లు బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్ పూర్తిగా అటకెక్కిపోయిందని అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం మాములుగా లేదు. సత్యదేవ్, నయనతార భార్యాభర్తలుగా నటించిన గాడ్ ఫాదర్ లో పూరి జగన్నాధ్ ఒక స్పెషల్ క్యామియో చేశారు. క్యాస్టింగ్ చాలా పెద్దదే ఉంది. సో గాడ్ ఫాదర్ విషయంలో ఉన్న డౌట్లు ఆల్మోస్ట్ తీరినట్టే కనిపిస్తోంది కానీ ఏ ట్విస్టు ఇవ్వకపోతే అదే సంతోషం

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş