iDreamPost
android-app
ios-app

KCR Rule – ఈ రెండేళ్లు కేసీఆర్ కు పులి స్వారీనే.. ఈ లెక్కలు మారితే కష్టమే.!

KCR Rule – ఈ రెండేళ్లు కేసీఆర్ కు పులి స్వారీనే.. ఈ లెక్కలు మారితే కష్టమే.!

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఓటమి ఇప్పటికీ ఆ శ్రేణులకు జీర్ణం కావడం లేదు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి కలిసి తమను ఓడించారని టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగంతో పాటు శ్రేణులకు కూడా సంకేతాలు పంపారు ప్రథమ శ్రేణి నేతలు. కానీ కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు అనే పథకం మాత్రం ఖచ్చితంగా హుజురాబాద్ ఎన్నికల కోసమే పుట్టుకువచ్చింది అనేది టీఆర్ఎస్ శ్రేణులు కాదు యావత్ తెలంగాణ ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి.. ముందు నుంచి ఇదే ప్రచారం జరుగుతుండడంతో కేసీఆర్ తాను గత ఏడాది ప్రకటించాలని అనుకున్నానని కాకపోతే కరోనా కారణంగా నిధులు సరిగ్గా లేక దాన్ని వాయిదా వేస్తూ వచ్చాను అని చెప్పుకొచ్చారు. అయితేనేమి ఎట్టకేలకూ దళిత బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి కేవలం హుజురాబాదు నియోజకవర్గంలో దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఈ పథకం కోసం మంజూరు చేశారు.

ఈ దళిత బంధు డబ్బు నిజంగా దళితులకు చేరిందో లేదో తెలియదు కానీ వారికి ప్రకటించి మాకు ప్రకటించకపోవడం ఏమిటి అంటూ ఇతర బీసీ కులాల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కు ప్రెజర్ పెరిగింది. దీంతో అప్పటికప్పుడు పరిస్థితిని దాట వేసేందుకు ప్రస్తుతానికి దళిత బంధు ఇచ్చామని త్వరలోనే అన్ని కులాలకు అదే విధంగా సహాయం చేస్తామని కేసీఆర్ సహా కేటీఆర్ కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏ ఉద్దేశంతో  దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశ పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఆ ఉద్దేశం నెరవేరుతుందా లేదా అనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఖచ్చితంగా దళితులకు దళిత బంధు అమలు చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ దళితులకు కనుక ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే దళితుల్లోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కెసిఆర్ గతం నుంచి కూడా దళితులకు చెప్పింది ఏమీ చేయలేదు.

ముందు దళిత ముఖ్యమంత్రి చేస్తాను అన్నారు చేయకపోతే తల నరుక్కుంటా ఉన్నారు ఆ హామీ నెరవేరలేదు, నెరవేరుతుందని ఆశ లేదు. ఆ తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి, సాగుకు అన్ని రకాల చర్యలు అంటూ మరో హామీ ఇచ్చారు అది కూడా అవుతుందన్న నమ్మకం లేదు. చివరికి ఈటెల రాజేందర్ పుణ్యమా అంటూ దళిత బంధు అనే ఒక కొత్త పథకం రూపొందింది. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఓటమి వంకతో కేసీఆర్ దానిని పక్కన పెట్టలేని పరిస్థితి. ఆ దళిత బంధు అమలు చేయడానికి ఇప్పుడు నిధుల కోసం వెతుక్కోవాలి, అంటే తమకు హామీ ఇచ్చారు కాబట్టి ఇతర కులాల వాళ్ళు కూడా కేసీఆర్ మీద ప్రెజర్ పెట్టే అవకాశం ఉంది. ఒకరకంగా ఈ రెండేళ్ల పాటు కేసీఆర్ పాలన అంతా పులి మీద స్వారీ లాంటిదే. ఎందుకంటే పులి మీద ఉన్నంత వరకు పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి గనుక అదుపు తప్పి కింద పడితే ఇక కష్టమే. తెలిసి వెళ్లారో తెలియక వెళ్లారో తెలియదు కానీ పద్మవ్యూహంలో అయితే చిక్కుకున్నారు. దళిత బంధు అమలుకు భారీ ఎత్తున నిధులు కావాల్సి వస్తే ఇతర కులాల వారికి ఎక్కడి నుంచి తెస్తారో చూడాలి. మరో రెండేళ్ల పాటు ఎలా నెట్టుకొస్తారో చూడాలి మరి.

Also Read :  Huzurabad By Poll-ఈటెల భవిష్యత్‌కు కేసీఆర్‌ బంగారు బాట..ఇక ఎవరొచ్చినా ఏం చేయలేరుగా?