విశాఖ ఉక్కు కంపెనీలో 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. ఉక్కు కంపెనీని ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లేఖ కంపెనీ పూర్వాపరాలు, సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలను సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
కంపెనీ ప్రైవేటీకరణ కాకుండా ప్లాంటను బలోపేతం చేసేందకు ఉన్న అవకాశాలున అన్వేషించాలని సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్లాంట్‌పై దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని, వేలాది మందికి పరోక్ష ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజలు దశాబ్ధం పాటు చేసిన పోరాటం ఫలితంగా ప్లాంటు ఏర్పాటు జరిగిందని వివరించారు. ఉద్యమంలో 32 మంది ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు.
2002–22015 మధ్య కాలంలో ప్లాంట్ మంచి పనితీరు కనబరిచిందని, లాభాలు ఆర్జించిందని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్‌పరిధిలో 19,700 ఎకరాల విలువైన భూములు ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఉత్పత్తి ఖర్చు భారీగా పెరగడం వల్ల ప్లాంటుకు కష్టాలు మొదలయ్యాయని వివరించారు. ప్లాంట్‌కు సొంతంగా గనులు లేవని సీఎం వైఎస్ జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం అండగా ఉండడం వల్ల ప్లాంట్‌ను మళ్లీ లాభాల బాట పట్టించవచ్చని సీఎం జగన్ వివరించారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 7.3 మిలియన్ టన్నులు కాగా 6.3 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో 200 కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని సీఎం జగన్ వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతగా గనులు లేవని సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. బైలదిల్లా నుంచి ముడి ఖనిజాన్ని ప్లాంట్ కొనుగోలు చేస్తోందని తెలిపాఉ. టన్ను ముడి ఖనిజాన్ని 5,260 చొప్పున కొనుగోలు చేస్తోందని, ఫలితంగా టన్నులకు దాదాపు 3,472 రూపాయల భారం పడుతోందని వివరించారు. సెయిల్‌కు దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని, విశాఖ స్టీల్‌కు సొంతంగా గనులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గనుల కేటాయింపు వల్ల పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి విశాఖ ప్లాంట్‌ను తీసుకెళ్లవచ్చని సీఎం జగన్ ప్రధాని మోదీకి వివరించారు.