సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బలభద్రపురం గ్రామంలో ఆదిత్యా బిర్లా గ్రూపు నిర్మించిన గ్రాసిమ్ కాస్టిక్ సోడా ప్లాంట్‌ను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లా హాజరవుతున్నారు.
సీఎం పర్యటన ఇలా..
సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10:50 గంటలకు బలభద్రపురంలోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11:05 గంటలకు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్లాంట్‌కు ప్రత్యేక వాహనంలో కుమారమంగళం బిర్లాతో కలసి వెళతారు. ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం సభలో పాల్గొంటారు. 12:40 గంటలకు తిరిగి సీఎం జగన్ తాడేపల్లి బయలుదేరుతారు.
2700 కోట్ల రూపాయలతో ప్లాంట్..
ఆదిత్యా బిర్లా గ్రూపు కంపెనీ బలభద్రపురంలో 2,700 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ స్థాయిలో కాస్టిక్ సోడా ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొరవతో ఆదిత్యా బిర్లా గ్రూపులో ఒకటైన గ్రాసిమ్ కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల విభజన తర్వాత రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు అయిన తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. వ్యవసాయానికి పేరుగాంచిన తూర్పుగోదావరిలో పారిశ్రామిక ప్రగతి కూడా పరుగులు పెడుతుండడం విశేషం.
72862