iDreamPost
android-app
ios-app

CM YS Jagan, PRC – దటీజ్ జగన్….చెప్పాడంటే చేస్తాడంతే!

CM YS Jagan, PRC – దటీజ్ జగన్….చెప్పాడంటే చేస్తాడంతే!

చెప్పాడంటే చేస్తాడంతే అని జగన్ గురించి ఆయన అభిమానులు అంటూ ఉంటారు. దాన్ని నిజం చేసేలా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ-పే రివిజన్ కమిషన్ ) ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా రోజులుగా దీని మీద చర్చ జరుగుతోంది.

తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్న సందర్భంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఆయన్ను కలిసి పీఆర్సీ నివేదిక అంశాన్ని త్వరగా ప్రకటన చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి అయిందని జగన్ వారికి చెప్పారు. అలాగే 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని కూడా అన్నారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరం అయినా వెళ్లే జగన్ పీఆర్సీపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వేతన సవరణకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. పీఆర్సీ సవరణ కమిటీ సిఫార్సులను పరిశీలించిన సీఎం.. ఎంతమేరకు పెంచాలన్న దానిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయం సోమవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వీటితో పాటు ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్‌ అయిన సీపీఎస్‌ రద్దు అంశంపైనా సమావేశంలో చర్చ జరగగా సీపీఎస్‌ రద్దు చేస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుంది? ఎంత మేర నిధులు వెచ్చించాల్సి వస్తుంది? ఎలా సర్దుబాటు చేయాలనే విషయంపై అధికారులతో సీఎం చర్చించినట్టు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాల్సిన అంశంపైనా అధికారులతో సీఎం చర్చించినట్టు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ, తదితర డిమాండ్లపై కూడా చర్చించారు. వీటన్నింటిపై ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు తెలిసింది.

Also Read : Tirupati Women, CM YS Jagan, Cell Phone – తిరుపతి మహిళకు ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎం జగన్‌

అసలు పీఆర్‌సీ అంటే ఏంటి?

పీఆర్‌సీ అంటే పే రివిజన్ కమిషన్. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి? ఎంత భత్యం ఇవ్వాలి వంటివి సిఫార్సు చేసే కమిటీ. ప్రతి అయిదేళ్లకోసారి ఈ సంఘాన్ని నియమిస్తారు. ఈ సంఘం ఇచ్చే సిఫార్సును విని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా జీతాలు పెంచడమే ఉంటుంది. పీఆర్‌సీ చెప్పిన దానికంటే కాస్త ఎక్కువే జీతాలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కమిటీని పే కమిషన్ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో పే రివిజన్ కమిషన్ అంటారు.