దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్.. సాయంత్రం ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను మోదీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారు. దాదాపు గంటపాటు మోదీతో వివిధ అంశాలపై సీఎం జగన్ చర్చించారు. సీఎం జగన్ వెంట వైసీపీ పార్లమెంటరీ నేత వి. విజయసాయి రెడ్డి. హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్‌లు ఉన్నారు.
కాగా, సీఎం జగన్ రేపు కూడా ఢిల్లీలో ఉండనున్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. రేపు ఉదయం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు.
Also Read : ఢిల్లీకి చేరుకున్న జగన్.. కాసేపట్లో ప్రధానితో భేటీ..