iDreamPost
android-app
ios-app

ఏపీ గవర్నర్‌తో ముఖ్యమంత్రి దంపతుల భేటీ

ఏపీ గవర్నర్‌తో ముఖ్యమంత్రి దంపతుల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌ తన సతీమణి వైఎస్‌ భారతితో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి దంపతులు గవర్నర్‌కు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు.

పరిపాలనపరమైన వ్యవహారాలపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ గరవ్నర్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో శాసన సభ సమావేశాలను నిర్వహించాలని యోచిస్తున్న ప్రభుత్వం ఈ విషయాన్ని సీఎం జగన్‌ గవర్నర్‌ దృష్టిలో పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే శాసన సభ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. శాసన సభలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి ముందుగానే సీఎం జగన్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి, దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలు, వచ్చిన ఫలితాల గురించి సీఎం జగన్‌ గవర్నర్‌కు వివరించారు. సంక్షేమ పథకాల అమలు తీరు, కొత్త పథకాల అమలుకు చర్యలు తదితర అంశాలపై సీఎం జగన్‌ గవర్నర్‌తో చర్చించారని సమాచారం.