Idream media
Idream media
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ ఎంగేజ్మెంట్‌ను దుబాయ్‌లో ఈ నెల 23వ తేదీ (శనివారం) జరిగింది. పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్ధం జరిపారు. అయితే నిశ్చితార్థం డేట్ కుదుర్చుకున్నప్పటి నుంచి సీఎం రమేష్ వేడుక నిర్వహణకు పూర్తి సమయం కేటాయించారు. దుబాయ్‌లో ఉంటూ నెల రోజులుగా ఆయన ప్రత్యేక ఏర్పాట్లలో తలమునలయ్యారు. దుబాయ్ లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రాస్ అల్ ఖైమా లో వేదిక ఖరారు చేశారు.
ఇదిలా ఉంటే, టీడీపీ యేతర నాయకుల పిల్లల పెళ్లి ఖర్చు వందలాది కోట్లు అయ్యిందని అసత్య కథనాలు రాసిన ఎల్లో మీడియా… ఇప్పుడు సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ ఖర్చుపై ఎందుకు రాయలేదని సోషల్ మీడియా వేదికగా అనేక మంది నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థానికి సంబంధించిన వివరాలను రాస్తూ ఎల్లో మీడియాను ప్రశ్నిస్తుండటం వైరల్ అవుతోంది.
సీఎం రమేష్ సుమారు రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ విషయాన్ని రాసేందుకు మనసు, చేతులు రాలేదా అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఎల్లోమీడియాపై విరుచుకుపడుతున్నారు. కేవలం ఎంగేజ్మెంట్‌కే రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నాడని, పెళ్లికి ఇంతకు పదింతలు ఖర్చు పెడుతాడని వారు లెక్కలేసి చెబుతున్నారు.ఇలాంటి వాస్తవాలు రాయడానికి ప్రధాన మీడియాకు మనసు రాదనీ, ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి సీఎం రమేష్‌నాయుడు కావడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్ చెల్లిస్తున్న ట్యాక్స్, ఇప్పుడాయన చేస్తున్న ఖర్చుకు ఎక్కడైనా పొంతన ఉందా? ఈ వివరాలను పచ్చ మీడియా రాయగలదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
సీఎం రమేష్ తన కుమారుడి నిశ్చితార్ధానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులను ఆహ్వానించారని, ఇందు కోసం వారు దుబాయ్ వెళ్లేందుకు ప్రత్యేకంగా 15 విమానాలను ఏర్పాటు చేశారని నెటిజన్లు చెబుతున్నారు. మనవి పేరుకే న్యూస్ పేపర్లు…రాసేవన్నీ వ్యూసే. సో వ్యూస్ పేపర్లలో నచ్చిన వారిని పొగుడుతూ, నచ్చని వారిని తెగుడుతూ రాయడమే సిద్ధాంతంగా పెట్టుకున్నాయి. అలాంటి వ్యూస్ పేపర్లలో, చానళ్లలో నిజాలను ఆశించడం అత్యాశే అవుతుంది.