రాబోవు 40 రోజుల్లో రాష్ట్రం లోని అన్ని ప్రాజెక్టులను నింపాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం అయన జలవనరుల శాఖ మంత్రి తో కలసి అధికారులతో జలవనురుల శాఖ పై సమీక్ష నిర్వహించారు. అన్ని నదుల్లో వరద భారీగా ఉన్నా ప్రాజెక్టులు నింపకపోవడంపై ఆరా తీశారు. తక్షణమే ఆయా ప్రాజెక్టుల్ని వరద నీటితో నింపేందుకు స్పష్టమైన కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నింపాలని స్పష్టం చేసారు.
జలయజ్ఞం లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులపై కూడా సీఎం ఆరా తీశారు. ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ సమస్య వాళ్ళ కొన్ని ప్రాజెక్టులు, అటవీ అనుమతులు పెండింగ్ వల్ల మరికొన్ని ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడంలేదని జలవనురుల శాఖ అధికారులు సీఎం కు వివరించారు.