పాలన వికేంద్రీకరణ విషయంలో జగన్ మరో ముందడుగు వేయబోతున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలు వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల ఇంటి ముంగటకే తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనను మరింత సరళీకరణ చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తోంది. ఇప్పటికే దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన అధికారగణం కొత్త జిల్లాల స్వరూపం, జనాభా, పాలన, కార్యాలయాలు వంటి కీలక విషయల్లో కసరత్తు పూర్తి చేసింది. దీంతో జనవరి 26 రిపబ్లిక్ డే రోజున కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. జిల్లాల ఏర్పాటు విషయంలో వివాదాలకు తావు లేకుండా కేవలం లోక్సభ పరిధిని ప్రాతిపదికగా తీసుకొని జిల్లాల ఏర్పాటు కే సీఎం మొగ్గు చూపారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై రకరకాల వాదనలు అభ్యర్ధనలు ఉండటంతో.. ఎక్కడ దేనిని అంగీకరించకుండా కేవలం లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగేలా సీఎం నిర్ణయించుకున్నారు. అరకు నియోజకవర్గం మాత్రం రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉండడంతో మొత్తంగా 26 జిల్లాల ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొస్తోంది. పాలన సౌలభ్యం వల్ల నిర్ణయాలు వేగవంతం కావడమే కాకుండా సంక్షేమ పథకాలు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా ప్రజలకు అనడానికి వీలు కలుగుతుంది. జిల్లా పాలనా యంత్రాంగం మొత్తం ఆయా జిల్లాలు చిన్నవి కావడంతో వెంటనే స్పందించి ఎందుకు వీలు ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 31 జిల్లాలు చేయగా, ఏపీ ప్రభుత్వం మాత్రం పాత జిల్లాలోనే కొనసాగిస్తోంది.
ఇది ముందడుగు!!
1956 నవంబర్ 1 న మద్రాస్ ప్రావెన్సీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు కేవలం 11 జిల్లాలుగానే ఏర్పడింది. అనంతర కాలంలో 1979లో విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి కొంత భాగాన్ని తీసుకుని విజయనగరం జిల్లా గా ఏర్పాటు చేశారు. అలాగే 1970లో నెల్లూరు, కర్నూల్, గుంటూరు లోని కొంత భాగాన్ని కలిపి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మళ్లీ కొత్త జిల్లాల ప్రతిపాదన ఏదీ రాలేదు. ఏపీలో 13 జిల్లాలు తెలంగాణలో 11 జిల్లాలు కొనసాగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ముందడుగు వేసింది. ఖచ్చితంగా పరిపాలన సౌలభ్యం ఉండాలి అనే కోణంలో కెసిఆర్ 11 జిల్లాల తెలంగాణ లో 31 జిల్లాల కు పెంచారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయలేదు. జగన్ ప్రభుత్వం పరిపాలన విషయంలో కొత్తగా ఆలోచించడంతో పాటు ప్రజలకు కచ్చితంగా పరిపాలన విషయంలో అత్యంత దగ్గరగా ఉండాలనే కోణాన్ని పరిశీలించింది. దీనిలో భాగంగానే మూడు రాజధానులు ప్రతిపాదనను సైతం జగన్ తీసుకువచ్చారు. పరిపాలన అంతా ఒకే దగ్గర ఉండకూడదని న్యాయ రాజధాని ఒక దగ్గర చట్టసభలు నిర్వహించే రాజధాని మరో దగ్గర పరిపాలన రాజధాని మరో దగ్గర ఉంటే అన్ని ప్రాంతాలకు న్యాయం చేసినట్లు అవుతుందని జగన్ భావించారు. దీంతోనే మూడు రాజధానులు ప్రతిపాదన గానీ ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు గానీ జగన్ తీసుకువచ్చారు. పరిపాలన విషయంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి అన్నదే ముఖ్యమంత్రి అభిమాతంగా కనిపిస్తోంది.
లోకసభ స్థానాలు పెరిగితే!!
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లో లోక్ సభ స్థానాలు పెంచాలని భావిస్తోంది. 543 లోకసభ ప్రాణాలను 640 కు పైగా పెంచాలని కేంద్రం చూచాయిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త లోక్ సభ భవనాన్ని సైతం ప్రారంభోత్సవ సమయంలో ప్రదర్శించిన నమూనా లోనూ 640 సీట్లు ఉండేలా దానిలో చూపడం విశేషం. అంటే భవిష్యత్తులో కచ్చితంగా లోక్సభ స్థానాలు పెరుగుతాయి. ప్రస్తుత లోక్సభ పరిధిలో ఒక్కో సభ్యుడు పరిధి గరిష్ఠంగా 40 లక్షలు కనిష్టంగా ఎనిమిది లక్షల మేర ఉంది. సగటు వచ్చేసరికి సుమారు 20 లక్షలు. ఎంత మందికి ఒకే ప్రతినిధిగా లోక్సభ సభ్యుడు ఉండేసరికి వారికి సైతం అందుబాటులో ఉండటం లేదు. దీంతో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి.. లోక్సభ స్థానాలు పెరిగితే అప్పుడు జిల్లా స్థాయిలో లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది. జగన్ ఆలోచన కరెక్ట్ అయితే, ఆంధ్రప్రదేశ్ లోనూ సుమారుగా 5 నుంచి 8 స్థానాలు పెరగవచ్చు. ఇప్పుడు లోక్ సభ స్థానాల ప్రతిపాదించిన జిల్లాలు ఏర్పాటు కనుక జరిగితే వచ్చే పునర్విభజనలో ఈ లోక్సభ స్థానాల స్వరూపం రెండు కావచ్చు. అంటే ప్రతి జిల్లాలోనూ లోక్సభ స్థానాలు పెరగవచ్చు. దీనివల్ల ప్రజాప్రతినిధులకు మంచి సౌలభ్యం ఉంటుంది అలాగే అధికారులకు పాలనా యంత్రాంగానికి సైతం ప్రజల పై పట్టు ఉంటుంది.