Idream media
Idream media
40 ఏళ్ల రాజకీయ అనుభవం, 3 సార్లు..14 ఏళ్లపాటు సీఎం గా పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కరించలేని సమస్యను చంద్రబాబు అనుభవమంత వయసున్న యువకుడు, మొదటి సారి ముఖ్యమంత్రి ఐనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిష్కరించారు. చంద్రబాబు తన పాలన 5 ఏళ్ల లో చేయలేని పనిని జగన్ కేవలం 5 నెలల కాలం లో చేయడం ప్రజా సమస్యల పరిస్కారం పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాల్లో సంతోషాలు నింపేలా డిపాజిటర్లకు నగదు చెల్లింపులు ప్రక్రియ గురువారం ప్రారంభించారు. గుంటూరులోలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మీ సోదరుడు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాడని భావించిన అక్కాచెల్లమ్మలకు ధన్యవాదములు. అగ్రిగోల్డ్ బాధితులు ఐదేళ్లుగా పడుతున్న బాధలు చూశా.. మీ అందరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మీ ముందు నిలబడ్డాను. 3,648 కి.మీ సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను విన్నాను. నేను ఉన్నానని మాట ఇచ్చాను. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశాను. కోర్టు పరిధిలో ఉన్నా.. తొలి విడతలో భాగంగ దాదాపుగా 3.70లక్షల మంది బాధితులకు న్యాయం చేస్తున్నాం. రూ. 10వేలలోపు డిపాజిట్లు ఉన్న బాధితులను ఆదుకునేందుకు రూ. 264 కోట్లు విడుదల చేశాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌లోనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు కేటాయింపులు చేశాం. ఐదు నెలల్లోపే బాధితులకు న్యాయం చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింత మందికి న్యాయం చేస్తాం. త్వరలోనే రూ. 20వేలలోపు డిపాజిట్ చేసినవారికి డబ్బులు అందజేస్తాం” అని పేర్కొన్నారు.
ప్రజా సంకల్ప పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను చుసిన జగన్.. అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల పై తీర్మానం చేశారు. బడ్జెట్లు లో తొలి విడతగా 1150 కోట్లు కేటాయించారు. ముందుగా 10 వేల లోపు డిపాజిట్లు ఉన్న వారికి చెల్లించేందుకు గత నెల 18న జగన్ సర్కార్ 260 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 10 వేలు లోపు డిపాజిట్లు ఉన్న 3,69,655 మందికి నగదు చెల్లింపు ప్రక్రియను సీఎం జగన్ నేడు గురువారం ప్రారంభించడం తో బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
1995 లో ప్రారంభమైన అగ్రిగోల్డ్ ఆనతి కాలం లోనే వేల కోట్ల డిపాజిట్లు ప్రజల నుంచి సేకరించింది. వ్యాపారాలు, ఆర్ఎంపి లు.. ఏజెంట్లుగా చేసి మధ్య పేద, తరగతి వర్గాల నుంచి నెలవారి గా డిపాజిట్లు సేకరించారు. ఆ మొత్తాలను అగ్రిగోల్డ్ భూముల పై పెట్టుబడులు పెట్టింది. 2014 లో టిడిపి అధికారం లోకి వచ్చే వరకు కార్యకలాపాలు సజావుగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయి , అమరావతి రాజధాని కావడం తోనే అగ్రిగోల్డ్ కు కష్టాలు మెదలయ్యాయి. రాజధాని ప్రాంతం లో వందల ఎకరాల విలువైన భూములు, హాయిలాండ్ పై టీడీపీ నేతల కన్ను పడింది. ఆ భూములను కొట్టేయడానికి ప్లాన్ చేశారు. అందులో భాగంగానే.. డిపాజిట్ల కంటే రెట్టింపు ఆస్తులు ఉన్న అగ్రిగోల్డ్ దివాళా తీసే స్థితికి తెచ్చారు.
బాధితులు కోర్టును ఆశ్రయించారు. భూములమ్మి చెల్లించేలా కోర్టు చేసిన ప్రయత్నాలు ప్రభుత్వ నిర్లక్ష్యం తో ఒక అడుగు ముందుకు.. మూడు అడుగుల వెనక్కి అన్న చందంగా సాగాయి. హాయిలాండ్ పై లోకేష్ కన్ను పడిందని ఆరోపణలు వచ్చాయి. అందుకు బలం చేకూర్చేలా.. అగ్రిగోల్డ్ ఆస్తుల అఫిడవిట్ లో ఉన్న హాయిలాండ్.. విచారణ సమయంలో తమది కాదని యజమానులు చెప్పడం, మళ్ళి తమదేనని అనడం.. అగ్రిగోల్డ్ ఆస్తుల పై అప్పటి ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని ప్రజలు అర్ధమైంది.
వందల సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. పలువురు ఏజెంట్లు తమ ప్రాంతాలను వదిలి వెళ్లిపోయారు. 5 ఏళ్ల పాటు మనోవ్యధ అనుభవించిన డిపాజిటర్లు, ఏజెంట్లకు.. ఎట్టకేలకు వైఎస్ జగన్ రూపంలో స్వాంతన కలిగింది. ప్రస్తుతం 10 వేలు లోపు ఉన్న డిపాజిట్లను చెల్లించిన ప్రభుత్వం.. తర్వాత 20 వేలు లోపు డిపాజిట్దారుల సొమ్ములు చెల్లించనుంది. విడతల వారిగా బాధితులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసారు.