Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దంపతులు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను కలిశారు. విజయవాడలోని గవర్నర్ నివాసానికి వెళ్లిన సీఎం జగన్ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు సీఎం జగన్ వివరించినట్లు సమాచారం.
కాగా, మూడు రాజధానుల ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో 4070 ఎకరాల భూకుంభకోణం జరిగిందని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది.
రాజధాని అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై మరికొద్ది నిమిషాల్లో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకర్ల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. చంద్రబాబు, అయన అనుచరులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారంటూ ఇటీవల మంత్రులు ఘంటాపథంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సీబీఐ, లేదా సీబీసీఐడీ, లోకయుక్తతో విచారణ జరిపించాలని గత నెల 27న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ గవర్నర్‌తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.