iDreamPost
android-app
ios-app

సాకారం కానున్న సొంతింటి కల!

  • Published Dec 25, 2020 | 6:06 AM Updated Updated Dec 25, 2020 | 6:06 AM
సాకారం కానున్న సొంతింటి కల!

మహా యజ్ఞానికి జగన్ శ్రీకారం!

సొంతిల్లు అనేది ప్రతి పేదోడి కల. దానిని సాకారం చేసుకునేందుకు కాయకష్టం చేసి, నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. కానీ రియల్ ఎస్డేట్ మాయా జాలంలో పేదలు సమిథలవుతున్నారు. సొంతింటి కల కలగానే మిగిలి పోతోంది. ఇందిరమ్మ ఇళ్లు ఆ ఇళ్లు ఈ ఇల్లు అంటూ పాలకులు ఇంతకాలం ఊరించారే కాని ..పేదల సొంతింటి కలసాకారం కాలేదు.. దీంతో నిరాశా నిస్పృహల్లో ఉన్న పేదోళ్లకు జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకం దొరకబోయిన తీగ చేతికి తగిలినట్లు అయింది. ఎందుకంటే నవరత్నాల్లో అతి కీలకమైనది అందరికీ ఇళ్ల పథకం. సాంకేతిక లోపాలు, స్థానికంగా నాయకుల అవినీతి అక్రమాలు, భూములపై వివాదాలు, కోర్టు కేసులు వెరసి 18 నెలలు దాటిపోయింది.కాకినాడ రూరల్, అర్బన్ మండలాల పేదల కల సాకారంలో జాప్యం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లో అమలు చేసి తీరాలని నిర్ణయించారు. ఎనిమిది సార్లు వాయిదా పడిన తర్వాత ఈ నెల 25న కాకినాడ సమీపంలోని కొత్తపల్లి మండలం కొమరగిరి లో ఈ పథకంకు సీఎం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చట్టబోతున్నారు.

కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ మండల ప్రజలకు ఇచ్చేందుకు ఆ రెండు చోట్ల స్థలాలు లేవని చెబుతున్నారు. అత్యంత ఖరీదైన భూములే ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ భూములున్నా వాటిని పక్కన పెట్టేశారు. మరోపక్క పారిశ్రామికవేత్తలకు ఇక్కడ స్థలాలు ఇచ్చారు. దీంతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జిల్లా అధికారులు, రెవెన్యూ యంత్రాంగం సుదీర్ఘ చర్చలు జరిపింది. యు. కొత్తపల్లి మండలం కొమరగిరి లో రూరల్, సిటీ మండలాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రెండు మండలాలకు చెందిన 16,840 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఎస్ ఈ జెడ్ భూములను ఇళ్లస్థలాల కోసం తీసుకున్నారు. రైతుల వద్ద ఎకరం రూ 40 లక్షల నుంచి రూ 50 లక్షల వరకు భూములు కొన్నారు. లబ్ధిదారులకు 350 ఎకరాల భూములు కాకుండా మరో 60 ఎకరాలను సి ఆర్ జెడ్ కింద వదిలేసారు. మరో 25 ఎకరాలు కొత్తపల్లి లో కూడా సేకరించారు. ఇది కూడా సిటీ, రూరల్ మండలాలకు చెందిన వారికే.

బృహత్తర కార్యక్రమం

పాలకులు మారారు..పరిస్థితులు మారాయి..కాని పేదోడి సొంతింటి కల కలగానే ఉంది. కానీ మాట ఇస్తే మడమ తిప్పని సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదోడి సొంతింటి కల సాకారానికి శ్రీకారం చుట్టుబోతున్నారు.. ఓ బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించారు..కాకినాడవేదికగా పేదోళ్ల కల త్వరలో సాకారం కాబోతోంది. ఈ విషయం తలుచుకుంటేనే పేదోళ్ల ముఖాల్లో చిరునవ్వు తొంగి చూస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే నగరాల్లో సొంతిల్లు ఉండడమనేది మధ్యతరగతికి తీరని కల. ఆ కలను సాకారం చేస్తున్న యువ నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అనడం అతిశయోక్తి కాదు.

మరోవైపు.. ఊరికి దూరంగానో, ఊరి పొలిమేరల్లోనో ఇంటి పట్టాలిస్తున్నారన్న ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అక్కసుకో చేస్తున్వే తప్ప వేరే కాదు. దశాబ్దాలుగా తాము చేయలేని పనిని జగన్ చేస్తుంటే కడుపు మంటతో చేస్తున్నవే కాని అన్యం కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రోజున క్రీమీ ల్యాండ్స్‌గా కనిపిస్తున్న కొన్ని వేల కాలనీలు…కొన్నేళ్ల క్రితం ఊరికి దూరంగా ఏర్పడినవేనని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.నెలవారీ ఆదాయంలో దాదాపుగా నాలుగోవంతు అద్దెల రూపేణా కట్టుకోవాల్సిన పేదోళ్లకు సొంతిల్లు అమర్చుకుంటే ఆ మేరకు మిగులుతుందని కోట్లాదిమంది ఆశలు తీరడం నిజంగా ముదావహం.

15 రోజులు ఏకదాటిగా..

జగన్ మోహన్ రెడ్డి ఓ మహా యజ్ఞంలా ఇల్లట్టాల పంపిణీని చేపడుతున్నారు..డిసెంబర్ 25 నుంచి 15 రోజులపాటు ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అందుకోసం 68 వేల 361 ఎకరాలను ఇళ్ల స్థలాల పంపిణీకోసం ఎంపిక చేశారు. – ఈ భూమి విలువ 23,535 కోట్ల రూపాయల మార్కెట్టు విలువ చేస్తుందని అంచనా. ఈ 15 రోజుల పాటు సాగే సొంతింటి పండుగలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ జరగబోతోంది. ఇంత బృహత్తర కార్యక్రమం ఎప్పుడో మహానాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. 2005 తర్వాత ఇళ్ల స్థలాల పంపిణీయే చోటు చేసుకోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు…ఇన్నేళ్లకు ఆయన కుమారుడు జగన్‌మోహన్ ‌రెడ్డి చేపట్టడం…సొంతింటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నవాళ్లకు నిజంగా పండుగ రోజే. అంతేకాకుండా, వైఎస్సార్ జగనన్న కాలనీల పేరిట…6,800 కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని మౌలిక వసతులతో…17,005 కాలనీలు ఏర్పడబోతున్నాయి. జగనన్న కాలనీల్లో 28 లక్షల 30 వేల ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించబోతున్నారు. తొలి దశలో 28 వేల 80 కోట్ల రూపాయల ఖర్చుతో 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మిస్తారు. ఇంతోవైపు ఇళ్ల పంపిణీలో జాప్యాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చుకుని రెచ్చిపోతున్నారు. దీనికికూడా ముఖ్యమంత్రి జగన్ ఈ మహా క్రతువు ద్వారా చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 25నాడు కేవలం ఒక్క రూపాయికే లక్షా 43 వేల 600 మంది లబ్దిదారులకు టిడ్కో ఇళ్లను అందజేయనున్నారు. ఒక్కొక్క టిడ్కో ఇంటి విస్తీర్ణం 300 చదరపు అడుగులు ఉంటుంది. ఇవన్నీ సొంతింటి కోసం కల గంటున్న అక్క చెల్లెమ్మలకు జగనన్న ఇస్తున్న కానుకలు. హ్యాట్సాఫ్ టూ జగన్..!