iDreamPost
iDreamPost
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గన్‌ఫౌండ్రికి చెందిన శైలేందర్, ఓంప్రకాష్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. బీ ఫామ్ తీసుకునేందుకు వచ్చిన ఓం ప్రకాష్ పై శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి దిగారు దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. టీడీపీ నుంచి వచ్చిన , అక్రమ వసూళ్లకు పాల్పడే నైజం ఉన్న ఓంప్రకాష్‌కు రాష్ట్ర బీజేపి నాయకులు ఎలా టికెట్ కేటాయిస్తారంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
గోషామహల్ రాజాసింగ్ ను శాసనసభ్యుడిగా గెలిపించినందుకే తమపై కక్ష తీర్చుకుంటున్నారని, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ వలన తెలంగాణలో పార్టీ బలపడదని, కార్యకర్తలకు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ అన్యాయం చేస్తున్నారని వారు మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన తమ పై రాష్ట్ర నాయకత్వం ఈ విధంగా వివక్షాపూరితంగా వ్యవహరిస్తే తమ దారి చూసుకుంటామని హెచ్చరించారు.