iDreamPost
android-app
ios-app

థియేటర్ల స్వచ్ఛంద మూసివేత కాదు , ప్రమాణాలు పాటించనందున చర్యలు తీసుకున్నాం : మంత్రి నాని

  • Published Dec 29, 2021 | 2:45 AM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
థియేటర్ల స్వచ్ఛంద మూసివేత కాదు , ప్రమాణాలు పాటించనందున చర్యలు తీసుకున్నాం : మంత్రి నాని

సినిమా టికెట్ రేట్ల పై , నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న థియేటర్ల పై చర్యల విషయంలో ఏపీ ప్రభుత్వం ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో చాలా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారని కొన్ని వార్తా పత్రికలలో కథనాలు రాగా ఈ రోజు , థియేటర్ల యాజమాన్యం , ఫిలిం డిస్ట్రిబ్యూటర్లతో భేటీ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ఆ విషయం పై స్పందించిన మంత్రి పేర్ని నానీ అవన్నీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసే ఉద్దేశంతో పుట్టించిన వదంతులు అని తేల్చిచెప్పారు . జీవో నెంబర్ 35 పై కోర్టు సూచనల అనంతరం వాటిని అనుసరించి టికెట్ రేట్ల గురించి ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని థియేటర్ల వర్గీకరణ , టికెట్ రేట్ల విషయం ఆ కమిటీ పరిశీలించి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్ణయిస్తామన్నారు . సినీ రంగం నుండి ఎవరైనా ఆ కమిటీని కలిసి టికెట్ రేట్ల గురించి కానీ , సినీ రంగంలో తమకున్న ఇతర సమస్యల గురించి కానీ చర్చించవచ్చని అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కమిటీ ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తుందన్నారు .

ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలతో సినిమా హాల్స్ నడపలేక స్వచ్ఛందంగా మూసేస్తున్నారని కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు నిజం కాదని , లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోకుండా , ఫైర్ డిపార్ట్మెంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా ఇతర నిబంధనలు పాటించకుండా ఉన్న థియేటర్లను 9 జిల్లాలలో 130 గుర్తించి కొన్నిటిని సీజ్ చేశామని , కొన్నింటి పై జరిమానా , కేసులు నమోదు వంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు . సహ థియేటర్లలో ఇన్స్పెక్షన్ జరుగుతున్న విషయం తెలిసి 22 సినిమా హాల్స్ వారు మూసేసి అందుబాటులో లేకుండా పోయారని తెలిపిన మంత్రి నానీ , ఈ సినిమా థియేటర్ల యాజమాన్యానికి లైసెన్సులు రెన్యూవల్ చేయించుకోవాలని , ఫైర్ ఎన్వోసీలు తీసుకోవాలని 2020 సెప్టెంబర్ భేటీలోనే సూచించామని అయినా నిబంధనలు పాటించకుండా ఈ రోజు చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి దురుద్దేశ్యాలు ఆపాదించడం సరికాదన్నారు .

సినిమా హాల్ కన్నా కిరాణా కొట్టు ఆదాయం ఎక్కువగా ఉంటే బాగోదు అన్న నానీ వ్యాఖ్యలను , మంత్రులు మీ లగ్జరీలు తగ్గించుకొని మాకు ఇవ్వండి అన్న మరో నటుడు సిద్దార్థ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా , నానీ ఏ రాష్ట్రంలో ఏ హాల్ పక్కనున్న వెచ్చాల కొట్టు ఆదాయం లెక్కేసాడో మాకు తెలియదని ఆ వెచ్చాల కొట్టు ఆదాయం తగ్గించటమో , లేదా ఆ హాలు ఆదాయం వెచ్చాల కొట్టు కన్నా పెంచటం తమ పరిధిలోని అంశం కాదన్న మంత్రి మరో నటుడు సిద్దార్థ్ నివాసం ఉండేది చెన్నైలో అతను టాక్స్ పే చేస్తున్న చెన్నైలోని మంత్రి స్టాలిన్ ను , కేంద్రంలోని మోడీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని , ఏపీ మంత్రుల జీవన విధానం చూడకుండా విలాసాలు అనుభవిస్తారని చెన్నైలో కూర్చొని ఎలా అంటారని కొట్టిపారేశారు .

Also Read : వేడెక్కిన రాజ‌కీయం : ఏపీ బీజేపీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌