iDreamPost
iDreamPost
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన రాజధాని భూ కుంభకోణం , ఈఎస్ఐ మందుల కుంభకోణం , ఫైబర్ గ్రిడ్ స్కాం ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పాలనా సమయంలో జరిగిన మరో స్కాం బయటపడింది. గతంలో ఆప్కోలో జరిగిన అవకతవకలపై ఆప్కో మాజీ చైర్మన్ కడపజిల్లా తెలుగుదేశం నేత గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో, కార్యలయాల్లో సిఐడి అధికారుల సోదాలు నిర్వహించారు.
ఆప్కో మాజీ చైర్మన్ గా గుజ్జల శ్రీనివాసులు ఉన్న సమయంలో చేనేత గ్రూపుల పేరుతో నిధులు గోల్ మాల్ చేశారని, సుమారు రూ.4వేల కోట్ల మేర అవినీతి జరిగిందని దీనిపై చర్యలు తీసుకోవాలని చేనేత ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య శ్రీనివాసులపై ముఖ్యమంత్రి జగన్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాదీనం చేసుకునట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయానికి సంభందించి అధికారులు దృవీకరించాల్సి ఉంది. చేనేత సహాకార శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచ్చెమనాయుడు కూడా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే అయితే ఈ వ్యవహారంలో అచ్చన్నాయుడు పాత్ర ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.