iDreamPost
iDreamPost
మాజీ సీఎం, టీడీపీ అధినేత సీఐడీ ఉచ్చులో చిక్కుకున్నట్టేనా? అమరావతి కుంభకోణం ఆయన మెడకు చుట్టుకున్నట్టేనా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారుతోంది. రాజధాని భూముల్లో సాగిన అక్రమాల భాగోతం మళ్ళీ తెరమీదకు వస్తోందా ?
ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిపాదిత రాజధాని కోసం వేలాది ఎకరాల విస్తీర్ణంలో సేకరించిన భూముల విషయంలో పలు అక్రమాలకు ప్రారంభంలోనే బీజం పడింది. ‘అమరావతి భూ కుంభకోణం’ గా అది పరిణమించింది.. రాజధాని నగర ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వివిధ విధానపరమైన అవకతవకలపై ఆంధ్రప్రదేశ్‌లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) విచారణ మొదలైంది. అందులో చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
Also Read:జగన్ సోషల్ ఇంజినీరింగ్ తెచ్చిన విజయం
ముఖ్యమంత్రిగానే కాకుండా ఎపి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కూడా చంద్రబాబు వ్యవహరించారు. దాంతో ద్విపాత్రాభినయం చేసిన బాబు ఈ అక్రమాల్లో కీలకపాత్రధారిగా ఆరోపణలున్నాయి. అమరావతి భూ కుంభకోణంలో పూర్తిగా కొత్త కోణాన్ని చాటుతున్న ఈ కేసులో ఐపిసి సెక్షన్ 120 బి (కుట్ర), 166, 167 మరియు 217 నమోదు చేయబడింది, 1977 అసైన్డ్ ల్యాండ్స్ చట్టం,ఎస్సీ / ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కూడా వర్తిస్తుందని భావిస్తున్నారు. గత కేబినెట్‌లోని మున్సిపల్ మంత్రి పి నారాయణ కూడా ఈ కేసులో నిందితుడుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరు నేతలకు సిఐడి ముందు హాజరుకావాలని సమన్లు జారీ అయ్యాయి.. దాంతో రాజకీయంగా ఇది కీలకనిర్ణయంగా భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిసీఐడీ విచారణకి హాజరుకావాల్సి వస్తున్న తరుణంలో కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందోననే చర్చమొదలయింది. చంద్రబాబు కి కొత్త తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికేఅనేక కేసుల్లో న్యాయపరమైన అంశాల ఆధారంగా స్టే తో సాగుతున్న చంద్రబాబు ఈసారి ఏం చేస్తారో చూడాలి.