iDreamPost
iDreamPost
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ చిక్కుల్లో పడ్డారు. ఇక్కట్లు కొనితెచ్చుకున్నారు. సీఐడీ విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు ఆయన మీద కేసు నమోదయ్యింది. విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయన మీద ఎఫ్ ఐ ఆర్ నమోదయ్యింది. జీరో ఎఫ్ ఐ ఆర్ గా నమోదు చేసి, కేసును తెలంగాణ కి బదిలీ చేసే ప్రయత్నంలో ఏపీ సీఐడీ ఉంది. ఐపీసీ 353, 341, 186, 120(బి) సెక్షన్ల కింద ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్టు సీఐడీ ప్రకటించింది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో విచారణకు సీఐడీ అధికారులు వెళ్లారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలపై నమోదయిన కేసులో విచారణకు రంగంలో దిగారు. తీరా విచారణ నిమిత్తం వెళ్లిన అధికారులను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో కలిసి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ లక్ష్మీనారాయణ యత్నించడంతో ఈ కేసు నమోదయ్యింది.
Read Also: సీఐడీ అధికారులు రాధాకృష్ణను బతిమిలాడారంట
అయితే తనను సీఐడీ అధికారులే అక్కడ ఉండమన్నారని, తాను వెళ్లడం వల్లనే విచారణ స్మూత్ గా జరిగిందని చెప్పుకున్న రాధాకృష్ణకు తీరా సీఐడీ రెస్సాన్స్ తో షాక్ తగిలినట్టుగా కనిపిస్తోంది తానొకటి తలస్తే దైవం మరోటి తలచిందనే లెక్కన పరిస్థితి ఉందని చెబుతున్నారు. చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడయిన లక్ష్మీనారాయణను కాపాడే యత్నంలో రాధాకృష్ణ కేసులో ఇరుక్కోవడం ఆసక్తిగా మారింది.