iDreamPost
android-app
ios-app

భారతీయులని అపహరించిన చైనా?

  • Published Sep 05, 2020 | 11:37 AM Updated Updated Sep 05, 2020 | 11:37 AM
భారతీయులని అపహరించిన చైనా?

భారత, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తత రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. అక్సాయిచిన్‌లో ఉన్న గల్వాన్ లోయలో చైనా కవ్వింపు చర్యతో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన గర్షణతో మొదలైన ఈ ఉద్రిక్తతలు రాను రాను చైనా కుయుక్తుల కారణంగా మరీ తీవ్రతరం అవుతునట్టు కనిపిస్తుంది. ఇప్పటికే చైనా చర్యలకు ప్రతిచర్యగా భారతసైన్యం చైనాకి అవకాశం ఇవ్వకుండా పాన్ గాంగ్ లేక్ దగ్గర కీలకమైన ఫింగర్ 4 ను , బ్లాక్ టాప్ ను స్వాధీనం చేసున్నారు . కీలకమైన ప్రాంతాలలో భారత సైన్యం పట్టు బిగించడంతో ఉడికిపోయిన చైనా సైన్యాలు మరో దొంగ దెబ్బకు అడుగులువేస్తున్నట్టు కనిపిస్తుంది.

ఒక పక్క దేశ రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో చైనా అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలోనే అరుణాచల్ ప్రదేశ్ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరో సారి తెగబడింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఎగువ సుబన్‌సిరి జిల్లాకు చెందిన ఐదుగురు భారత పౌరులని చైనా ఆర్మీ అపహరించుకు పోయినట్టు తెలుస్తుంది. టాగిన్ వర్గానికి చెందిన విరు వేట కోసమని అడివిలోకి వెళ్ళిన సమయంలొనే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ ఘాతుకానికి తెగబడినట్టు అక్కడి వారు చెబుతున్నారు.

అపహరించిన వారి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు చైనా ఆర్మీ చెరలో బందీగా ఉన్న వారిలో తోచ్ సింగ్ కం, ప్రసాత్ రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తనూ బకర్, నారు దిరి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బృందంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా , చైనా ఆర్మీ ఐదుగురిని అపహరించినట్టు మరో ఇద్దరు వారి బారి నుండి తప్పించుకుని జరిగిన సంఘటనను గ్రామస్తులకు తెలిపినట్టు తెలుస్తుంది. ఈ సంఘటనతో ఏ క్షణం ఎలా ఉంటుందో అని గ్రామస్తులు బయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కలగచేసుకుని తమ వారిని తిరిగి దేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.