దళిత యువకుని శిరోముండనం కేసులో నిందితురాలిగా ఉన్న బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు భార్య మధుప్రియకు బెయిల్ దక్కిన ఆనందం కొద్ది గంటలు కూడా నిలవలేదు.ఆమెను బెయిల్‌పై విడుదలైన కొద్ది గంటల్లోనే చీటింగ్ కేసులో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే ఆగస్టు 28న తమ శ్రీకాంత్ అనే దళిత యువకుడికి దొంగతనం చేసాడన్న నెపంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియ మరో ఏడుగురితో కలిసి శ్రీకాంత్ కు శిరోముండనం చేశారు. దీంతో అతడు తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారిస్తున్న సమయంలో నూతన్ నాయుడు చేసిన మోసాలు వరుసగా వెలుగులోకి వచ్చాయి.
నూతన్ నాయుడు భార్య మధుప్రియ కూడా ఉద్యోగాల పేరుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి నుండి 25లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో బెయిల్ పొందిన ఆమె కొద్ది గంటల్లోనే మళ్ళీ అరెస్ట్ కావడం గమనార్హం. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి డబ్బులు వసూలు చేసారని మోసపోయిన వ్యక్తి పిర్యాదు చేయడంతో పోలీసులు మధుప్రియపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు