Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మరోసారి గవర్నర్ కు లేఖ రాశారు. అయితే ఆయన గవర్నర్ కు రాసిన లేఖలో ఏమైనా ప్రజా సమస్యలున్నాయా..? అని పరిశీలిస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఆయన ఏ పర్పస్ మీద రాశాడో..? లేక ఏదో రాయాలి కనుక రాశాడో తెలియదు కాని ప్రజా సమస్యలు లేని లేఖ రాసి మరోసారి తన దుర్భద్ది బయట పడింది.
ఒక నాయకుడు రాజ్యంగ అధిపతులకు లేఖలు రాస్తే అందులో ప్రజా సమస్యలు డిమాండ్లుగా ఉండాలి. అంతేతప్ప తమ పార్టీ సమస్యలను ప్రజా సమస్యలుగా చిత్రీకరించి లేఖ రాయడం వల్ల ఆ నేతల అవగాహన రాహిత్యానికి నిదర్శనం. సరిగ్గా ప్రతిపక్ష నేత చంద్రబాబు తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడానికే చంద్రబాబు లేఖ రాశారుగాని, ప్రజా సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదనిపిస్తోంది. ఏదో తన పాలనలో ప్రజాస్వామ్యానికి స్థానమున్నట్లు…ఇప్పుడు ప్రజాస్వామ్య, ప్రాథమిక హక్కులు, అక్రమ అరెస్టులు, భావప్రకటన స్వేచ్ఛా వంటి అంశాల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది. ఆయన పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అక్రమ అరెస్టులకు పాల్పడి, ప్రాథమిక హక్కులు కాలరాసి, భావప్రకటన స్వేచ్ఛకు భంగం కల్పించే విధంగా వ్యవహరించిన చంద్రబాబుకు అవి ఇప్పుడు గుర్తుకు వచ్చాయా..? అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.
చంద్రబాబు గవర్నర్‌కు రాసిన లేఖలో ఏముందటే..? అందులో ఉన్నయన్ని బూటకపు ఆరోపణలే. ఆంధ్రప్రదేశ్‌లో వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్న చంద్రబాబు.. ఆయన పాలనాకాలంలో చేసిన వాటిని మరిచిపోయారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ, పరిరక్షణ కోసం లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు నాడు ప్రాథమిక హక్కులు ఎలా కాలరాయబడ్డాయో గుర్తుకు లేదా..?
చట్ట విరుద్ధమైన అరెస్టులు, అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్న చంద్రబాబు ఆయన పాలనలో ఎంత మందిని అమాయకులను అక్రమంగా అరెస్టు చేసి..జైల్లో పెట్టారో మరిచిపోయారా చంద్రబాబు..? సోషల్ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్న చంద్రబాబు నాడు సోషల్ మీడియా కార్యకర్తలపై ఎంతమందిపై కేసులు పెట్టారో అందరికి తెలిసిందే..!
మరో నిరాధార ఆరోపణలు చంద్రబాబు చేశారు. రూ.5.20 కోట్ల నగదు అక్రమ రవాణా కేసులో ఎమ్మెల్యే బాలినేనిపై విమర్శలు చేస్తూ చంద్రబాబు వాస్తవాలను విస్మరించారు.
తమిళనాడులో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నగదు ఒంగోలుకు చెందిన ఎన్‌విఆర్ జ్యూయలర్స్‌కు చెందిందని ఆ సంస్థ యజమాని నల్లమల్లి బాలు వెల్లడించారు. శ్రావణ మాసం వస్తున్న సందర్భంగా హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్న తాము బంగారం కొనుగోలు చేయడానికి తమిళనాడుకు తమ గుమస్తాలను నగదుతో పంపించామన్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న సందర్భంగా రూ. 5,22,50,000 కారులో పంపామన్నారు. అయితే పోలీసుల తనిఖీల సందర్భంగా పట్టుబడటంతో ఆ నగదును తమిళనాడుకు చెందిన ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారని ఆయన వెల్లడించారు.
ఆదాయ పన్ను శాఖ అధికారులు ఒంగోలుకు వచ్చి మా షాపు, ఇళ్లు తనిఖీలు చేశారని వివరించారు. ఈ సందర్భంగా తమిళనాడులో పట్టుబడిన నగదుకు సంబంధించి నోటీసు కూడా ఇచ్చారన్నారు. ఆ డబ్బుకు లెక్కను చూపించమని కోరారని వెల్లడించారు. అయితే నగదు పట్టుబడినప్పటి నుంచి రాజకీయ నాయకులకు, పార్టీలకు సంబంధించిందని మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ నగదుతో ఏ రాజకీయ నాయకుడికీ సంబంధం లేదన్నారు.
ఆదాయ పన్నుతో పాటు ప్రభుత్వాలకు చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు ఎన్‌విఆర్ జ్యుయలర్స్ యజమానులు చెల్లిస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రకంపనలు చేయడమే కొంతమంది పనిగా పెట్టుకున్నారని అవి ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి నగదు కాదన్నారు. ఇలా స్వయానా డబ్బు యజమానే ముందుకొచ్చి చెప్పినప్పటికి చంద్రబాబు..గవర్నర్‌కు రాసిన లేఖలో ఆ డబ్బు గురించి రాజకీయ నాయకులకు ముడిపెట్టి రాశారంటే…ఆయన దిగజారుడు రాజకీయాలు బయటపడుతున్నాయి.