iDreamPost
android-app
ios-app

ఆ సలహా ఏదో ట్రంప్ కు ఇవ్వచ్చు కదా బాబు.

  • Published Apr 28, 2020 | 2:26 PM Updated Updated Apr 28, 2020 | 2:26 PM
  • Published Apr 28, 2020 | 2:26 PMUpdated Apr 28, 2020 | 2:26 PM
ఆ సలహా ఏదో ట్రంప్ కు ఇవ్వచ్చు కదా బాబు.

ఏం చెప్పినా గుడ్డిగా నమ్మే అమాయకులు ఉంటే కొంతమంది అనుచరులు తమ నాయకుడి గురించి, ఆయన గొప్పతనం గురించి, మానవాతీత శక్తులు, మహిమల గురించి ప్రచారం చేసి ఒక ఆరా (aura) సృష్టిస్తారు. సాధారణంగా బాబాలు ఇలా పడుతారు.

ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆయన అనుచరులు, భక్తులు తమ అనుకూల మీడియాలో, ట్విట్టర్లో ఇలాంటి ప్రచారం ఒకటి మొదలుపెట్టారు. రాష్ట్రంలో కరోనాని అదుపు చేయడం తనవల్ల కాదని జగన్ ఒప్పుకొని, చంద్రబాబుకి అధికారం అప్పగిస్తే పది రోజుల్లో కరోనాని వారు అదుపు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమ, ట్విట్టర్లో చాలామంది చంద్రబాబు అభిమానులు అంటున్నారు.

చాలా కష్టపడి, అలుపెరుగకుండా పాదయాత్ర చేసి సాధించిన అధికారం జగన్ వదులుకునే అవకాశం లేదు. అలా అని తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం చంద్రబాబుకు దక్కదు అనుకోవలసిన పని లేదు.

కరోనా వల్ల అతలాకుతలం అవుతూ, పాజిటివ్ కేసుల, మరణాలు అమెరికాలో నానాటికీ పెరిగిపోతున్నాయి. భారత ప్రధాని తో కలిసి పనిచేయమని మీరు గతంలో ట్రంప్ కు సూచించిన చనువు ఉండనే ఉంది కనుక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపుకి ఫోన్ చేసి కరోనాని అదుపు చేయడానికి వీరి దగ్గరున్న ఆయుధాలు ఏమిటో వివరిస్తే, ట్రంప్ కన్విన్స్ అయి, తన ప్రత్యేక విమానం పంపించి చంద్రబాబుని అమెరికాకి పిలిపించుకుని కరోనా కంట్రోల్ బాధ్యతలు అప్పగిస్తాడు. సాక్షాత్తు ఎయిర్ ఫోర్స్ వన్ విమానం వస్తే విమానయానం మీద ఉన్న అన్ని ఆంక్షలు తొలగించాల్సిన పరిస్థితిలో మోడీ కూడా ఉంటారు.

అమెరికాకు వెళ్ళి, పది రోజుల్లో కరోనా తాట తీస్తే చంద్రబాబు పేరు, ఇండియా పేరు ప్రపంచమంతా మారుమోగిపోతాయి. చంద్రబాబు తిరుగు ప్రయాణం సమయంలో విమానాశ్రయంలో బాబు గారి చేతులు పట్టుకుని “మిస్టర్ బాబూ, మీరు చేసిన ఈ గొప్ప సహాయానికి నేనూ, నా దేశం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలదు” అని ట్రంప్ అడిగినప్పుడు “భారతీయులకు, ప్రత్యేకంగా తెలుగువారికీ వీసాలు, ఉద్యోగాలు ఎక్కువగా ఇవ్వమని మీ కంపెనీలకు ఆర్డర్ వేయండి” అని చెప్పి, అందుకు ట్రంప్ ఆమోదముద్ర పొంది తిరిగివస్తే రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోనే చంద్రబాబు ప్రతిష్ట ఆకాశానికి చేరుకుంటుంది. ఇప్పుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలుపని నరేంద్ర మోడీ అప్పుడు బాబుగారి స్నేహహస్తం కోసం, ఎన్నికల్లో పొత్తు కోసం కాళ్ళావేళ్ళా పడే పరిస్థితి.

హిమాలయాలంత ఎత్తుకి ఎదిగిపోయిన కీర్తి ప్రతిష్టలతో 2024 ఎన్నికల్లో బాబుగారు పోటీ చేస్తే వారి విజయాన్ని అడ్డుకోవడం వందమంది జగన్ లకైనా సాధ్యమా?!!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom