Idream media
Idream media
చంద్రబాబుని జగన్ బలే ఇరుకున పడేశారు. కర్ర విరక్కుండా , పాము చావకుండా తెలివిగా మాట్లాడ్డం బాబు పద్ధతి. గతంలో తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఇంకోమాట మాట్లాడుతూ దానికి రెండు కళ్ల సిద్ధాంతమని పేరు పెట్టుకున్నారు.
ఇపుడు వైజాగ్‌కి అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ వద్దు అని అనలేదు. ఎందుకంటే ఉత్తరాంధ్రకి కోపం వస్తుంది. కర్నూల్‌కి హైకోర్టు వద్దనలేరు. అలాగని జగన్‌ని సపోర్టు చేయలేరు. అమరావతి కావాలని చెప్పాలి. కర్నూల్‌కి, వైజాగ్‌కి కోపం రాకుండా చూసుకోవాలి.
నిజం చెప్పాలంటే సామాన్య జనానికి ఎన్ని రాజధానులు ఉన్నా ఒకటే. వాళ్లకేం ప్రధాన కార్యాలయాల్లో పనులుండవు. మంత్రుల పేషీల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇబ్బంది అంతా కాంట్రాక్టర్లకి, పైరవీకారులకే.
అసలు అమరావతి గురించి మాట్లాడే అర్హతే లేదు బాబుకి. ఎందుకంటే ఐదేళ్లు జనం కళ్లకి గంతలు కట్టడం తప్ప, కట్టింది ఏమీలేదు. అయినా 4 వేల ఎకరాలు సొంత మనుషులకి కట్టబెట్టి , దానికి సమాధానం చెప్పకుండా విమర్శలు చేస్తున్న బాబు గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. పైగా వైజాగ్‌లో వైసీపీ వాళ్లు భూములు కొన్నారని ఎదురు దాడికి దిగుతున్నాడు.
ఒక రకంగా ఇది విజయవాడలో ఉన్న సామాన్యులకి ఇది ఊరట. కనీసం అద్దెలైనా నేల దిగి వస్తాయి. అమరావతి కట్టకపోతే భావితరాలకి నష్టం ఏమీ జరగదు. ఎందుకంటే వచ్చేది నూటికి నూరు శాతం డిజిటల్ యుగం. దానికి పెద్దపెద్ద ఆఫీసులు, ఫైళ్లు అక్కర్లేదు. తనది గొప్ప విజన్ అని చెప్పుకునే బాబుకి కనీస విజన్ కూడా లేకపోవడం అంటే ఇదే!