iDreamPost
android-app
ios-app

Chandrababu Petrol Politics – పెట్రో ధరలు – చరిత్ర మరచిపోయారా బాబూ..?

  • Published Nov 06, 2021 | 12:47 PM Updated Updated Nov 06, 2021 | 12:47 PM
Chandrababu Petrol Politics – పెట్రో ధరలు – చరిత్ర మరచిపోయారా బాబూ..?

సందు దొరికింది కదా అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం ముందు అడ్డగోలు డిమాండ్లు ఉంచుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ ధరలు పెరగడంతో జనం ఇబ్బంది పడుతున్నారు అంటూ మొసలి కన్నీరు కార్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో పెట్రో ధరల విషయంలో తమ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని గ్రహించిన కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. అదేబాటలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్ పై సెస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.ఇక అప్పటి నుంచి బాబుగారు తనదైన శైలి రాజకీయానికి తెర తీశారు.

కనీసం రూ.16 తగ్గించాలట!

రాష్ట్రంలో పెట్రో ధరలు కనీసం రూ.16 వరకు తగ్గించి తీరాలి. ప్రజలంతా చైతన్యవంతులై జగన్‌ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలి. అధికారం చేతుల్లో ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. ధరలు పెరగడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు. రాష్ట్రంలో పెట్రో ధరలు తగ్గించేవరకు తెదేపా పోరాటం చేస్తుంది. ఈనెల 9న మధ్యాహ్నం 12నుంచి ఒంటిగంట వరకు పెట్రోల్‌ బంకుల వద్ద ఆందోళనలు చేపడతాం అంటూ తన అవకాశవాద రాజకీయానికి చంద్రబాబు పదును పెడుతున్నారు. ఒకేసారి లీటరు పెట్రోల్ కు రూ. 16 తగ్గించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆ మేరకు డిమాండ్ చేయగలరా? తగ్గించే వరకు ఉద్యమాలు చేయగలరా? ఆసలు ఏ ప్రభుత్వం అయినా ఆ స్థాయిలో ధరలు తగ్గించ గలదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఆ విషయం తెలియదా? కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని అర్థం పర్థం లేని డిమాండ్లు చేసి, ఉద్యమం చేస్తాననడం రాజకీయమా? ప్రజాహితమా?

Also Read : Indian Navy – AP Executive Capital : ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖ.. గుర్తించిన ఇండియన్‌ నేవీ

రాష్ట్ర ప్రభుత్వం స్పందించినా రాజకీయమేనా?

పెట్రోల్ ధరల తగ్గింపుపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఇప్పటికే ప్రకటించారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ సెస్ తగ్గించినా ఆ క్రెడిట్ దక్కకుండా చేయడానికి లీటరుకు రూ.16 చొప్పున తగ్గించాలని డిమాండు చేయడం ద్వారా దివాలాకోరు రాజకీయం కాక మరేమిటి?

తమ హయాంలో మాటేమిటి?

ఇతర రాష్ట్రాల్లో కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ధరలు ఉన్నాయని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు తన పాలనలో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో ధరలు మండిపోయిన విషయం మర్చిపోయారా? తమ విజనరీ పరిపాలనలో పెట్రోల్ పై ఒకేసారి లీటరుపై నాలుగు రూపాయలు సెస్ విధించినప్పుడు జనం ఇబ్బందులు గుర్తుకు రాలేదా? అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినప్పుడల్లా ఆ మేరకు సెస్ పెంచిన ఘనత చంద్రబాబుది కాదా?

జగన్‌ది తుగ్లక్‌ పాలన అయితే బాబుది ఔరంగజేబు పాలనా..

జగన్‌ది తుగ్లక్‌ పాలన అని తరచు విమర్శిస్తున్న చంద్రబాబు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి చేసినది ఔరంగజేబు పాలనా? అనే విమర్శ వైసిపి నేతలను నుంచి వినిపిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజాహితం కోసం ఎన్ని పథకాలను అమలు చేస్తోందో అందరికీ తెలుసు. ధర్మాన చేసిన ప్రకటనను బట్టి పెట్రోల్ ధరల తగ్గింపు విషయంలో కూడా సానుకూల నిర్ణయం వస్తుందని జనం నమ్ముతున్నారు. ఈ లోపు రాజకీయం చేసేసి ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనుకుంటే చంద్రబాబు బుద్ది బయట పడుతుంది తప్ప ప్రయోజనం శూన్యం.

Also Read : Mini Municipal Elections – టీడీపీ పొత్తుల రాజకీయం.. అదే లక్ష్యమా..?