iDreamPost
android-app
ios-app

చేసినవి కబ్జాలు ఆపై దబాయింపా – ఇదేం తీరు చంద్రబాబు?

  • Published Oct 27, 2020 | 3:49 PM Updated Updated Oct 27, 2020 | 3:49 PM
చేసినవి కబ్జాలు ఆపై దబాయింపా – ఇదేం తీరు చంద్రబాబు?

ప్రజల ఆస్తులకి పరిరక్షకులుగా ఉండాల్సిన నాయకులే అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా అడ్డగోలు దోపీడికి పాల్పడటం ప్రజల ఆస్తులని కొల్లగొట్టి అనునాయులకి ఇచ్చుకోవడంలాంటి అనైతిక చర్యలు దేశవ్యాప్తంగా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5ఏళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మాత్రం ఎటువంటి భయం బెరుకు లేకుండా ప్రజల ఆస్తులని పబ్లిక్ గా కొల్లగొట్టి ప్రభుత్వ భూములలో కబ్జాలకు పాల్పడిన వైనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ముఖ్యమంత్రిగా ఉంటూనే రైట్ రాయల్ గా కబ్జాలకు పాల్పడ్డ చంద్రబాబు, ఎవరైన ప్రశ్నిస్తే అడ్డగోలుగా దబాయించడం పరిపాటిగా మారింది.

అక్రమ నిర్మాణం ప్రజావేదిక

తొలుత జగన్ అధికారంలోకి రాగానే నిబంధనలకు విరుద్దంగా కృష్ణా పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను నిబంధనలు అనుసరించి కూల్చితే జగన్ ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం.., మాది నిర్మించే ప్రభుత్వం అంటూ పొంతన లేని వాదనను తెరపైకి తెచ్చారు. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి పాల్పడ్డారు. అయితే ప్రజలు తెలుగుదేశం నాయకుల వాదనకు వత్తాసు పలకకపోగా వారి కబ్జా వ్యవహారాన్ని ప్రశ్నించడంతో నవ్వులు పాలయ్యారని గ్రహించిన తేదాపా నాయకులు ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టారు.

Also Read: నిమ్మగడ్డ సమావేశానికి వైసిపి వెళ్లడంలేదు: అంబటి

పోరంబోకు భూమిలో టీడీపీ కార్యాలయం

టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కి మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణం పేరిట మూడు ఎకరాల 65 సెంట్లు లీజుకు కేటాయించారు. అయితే వారు నిర్మాణం చేపట్టిన సర్వే నంబర్‌లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములు ఉండటం వాటిని వారు అధికారం అడ్డుపెట్టుకుని ఆక్రమించుకుని నిర్మాణలకు పాల్పడ్డారంటు అధికార పార్టి శాసన సభ్యులు ఈ వ్యవహారాన్ని తొలుత హై కోర్టు దృష్టికి తదనంతరం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకుని రాగా తాజాగా స్పందించిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టి మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలుగుదేశానికి, రాష్ట్రప్రభుత్వానికి ఆదేశించింది. ఇక చంద్రబాబు కరకట్ట మీద నివాసం ఉండే లింగమనేని గెస్ట్ హౌస్ ఐతే ఏకంగా కృష్ణా నదిని ఆక్రమించి కట్టినదే… వరద వస్తే తమ తప్పు తెలుసుకోకుండా దీనిని పాలక పక్షం పై నెట్టే నెర్పరితనం ఒక్క బాబుకు మాత్రమే సోంతం.

Also Read: టార్గెట్ 2024 @ ఏపీ నెంబ‌ర్ వ‌న్

కోట్లు చేసే ప్రభుత్వ భూమిపై గీతం కన్ను

చంద్రబాబు బంధువు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి సారధ్యంలో విశాఖలో ప్రైం ఏరియాలో నడిచే గీతం విశ్వవిద్యాలయం కోట్లు విలువ చేసే 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని అధికారులు నిర్ధారించటంతో రెవెన్యు, పోలీసు అధికారుల సమక్షంలో ఆ భూమిలో గీతం వారు నిర్మించిన అక్రమ కట్టడాలని కూల్చి అధికారులు తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై  కోర్టులో స్టే రావడం తో నవంబర్ 30వ తేదీ వరకు తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రభుత్వ భూమిని తెలుగుదేశం నేత అయిన గీతం మూర్తి ఆక్రమించుకుంటే , ఆ భూమిని జగన్ ప్రభుత్వం తిరిగి స్వాధీన పరుచుకుని ప్రజలకి సంబంధించిన ఆస్తిని పరిరక్షించారు. అయితే ఈ వ్యవహారంలో కూడా కళ్ల ముందు అధికారులు సాక్ష్యాలు చూపిస్తున్న జగన్ తమపై కక్ష సాధిస్తున్నాడు అని చంద్రబాబు , లోకేష్ గగ్గోలు పెట్టడం కొసమెరుపు. 

Also Read: విశాఖ‌పై వైసీపీకి పెరుగుతున్న ప‌ట్టు

బాబు స్పూర్తితో టీడీపీ నేతలు సైతం

ఇక తెలుగుదేశం నేతలుగా ఉన్న సబ్బం హరి, పీలా గోవింద్, గోరెల్ల శ్రీధర్ లాంటి ప్రబుద్దులు ప్రభుత్వ స్థలాలని ఆక్రమించుకుని నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నం చేసినా, ఆ సదరు నిర్మాణాలు అక్రమమా సక్రమమా అనే కీలక విషయంపై మాట్లాడకుండా జగన్ ప్రభుత్వం తెలుగుదేశం నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు చెప్పడం చూస్తే తమకు తమ పార్టీ నాయకులకి ప్రభుత్వ భూములని ఆక్రమించటం తమ జన్మతా వచ్చిన హక్కు గా భావిస్తున్నారా అనే అనుమానం కలగక మానదు .. ఏది ఏమైనా తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యవహారం చూస్తే రాష్ట్రంలో ఉన్న వాగులూ వంకలు తమ సొంత భూములు అన్నట్టుగా అక్రమ నిర్మాణాలకు పాల్పడటం ఆపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దబాయించటం చూస్తే తెలుగుదేశం పార్టీ  కబ్జాకోరుల ముఠాకు నిలయంగా మారిందా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.

Also Read: ఆ జాతీయ పార్టీ…. దుబ్బాకతో దుకాణం బంద్ !