ఆ జాతీయ పార్టీ.... దుబ్బాకతో దుకాణం బంద్ !

By Voleti Divakar Oct. 28, 2020, 09:48 am IST
ఆ జాతీయ పార్టీ.... దుబ్బాకతో దుకాణం బంద్ !

తెలుగుదేశం పార్టీ పేరుకే జాతీయ పార్టీ. ఆపార్టీ ఉనికి కేవలం ఆంధ్రాకే పరిమితం. తెలంగాణాలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో టిడిపి పోటీలో లేకపోవడాన్ని ఈ విషయం స్పష్టం చేస్తోంది. గతంలో కూకట్ పల్లి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనవరాలు, దివంగత టిడిపి నాయకుడు హరికృష్ణ కుమార్తెను సుహాసినిని | పోటీలోకి దింపి అబాసుపాలుకావడంతో పాటు, ఎన్టీఆర్‌కు ఉన్న ఇమేజ్ ను కూడా దెబ్బతీసిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా దుబ్బాక ఎన్నికలకు దూరంగా ఉండి, ఆపార్టీ తన స్థాయిని, బలాన్ని గుర్తించినట్టయ్యింది.

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ నివాసం తెలంగాణాలోని హైదరాబాద్. వారి సంస్థ హెరిటేజ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే పార్టీ మాత్రం ఆంధ్రాకే పరిమితమైంది. రానున్న రోజుల్లో ఆంధ్రాలో కూడా దాని ఉనికి అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఉభయ తెలుగు రాష్టాల్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షులను ప్రకటించారు. ఆంధ్రాలో అచ్చెంనాయుడిని నియమించి, తెలంగాణాలో మాత్రం మళ్లీ రమణకే పట్టం కట్టి, పార్టీ పరిస్థితిని పరోక్షంగా ప్రజలకు తెలియజేశారు.

మరోవైపు దుబ్బాక ఎన్నికల్లో గెలుపు ఎవరిదైనా జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు టిఆర్ఎస్లో పోటీపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెతో కలిసి పోటీ చేసినా ఈసారి పూర్తిగా అస్త్ర సన్యాసం చేయడం రాజకీయ వర్గాలను పెద్దగా ఆశ్చర్యపరచడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికలతో టిడిపి పార్టీ తెలంగాణాలో దుకాణాన్ని బంద్ చేసేందుకు ఉపక్రమించినట్లు అంచనా వేస్తున్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి పూర్తిగా తన పార్టీని కట్టి పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. *

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp