iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు భయం వేస్తోందట..!

చంద్రబాబుకు భయం వేస్తోందట..!

ముందు టీడీపీ నేతలపై దాడులు చేశారు. ఆ తర్వాత అమరావతి రైతులపై దాడులు చేశారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలపైనే దాడులు చేస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తే రాష్ట్రం ఏమవుతోందోనన్న భయం వేస్తోంది.. అంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెం నాయుడును, హత్య కేసులో కొల్లు రవీంద్రను, వాహనాల అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై, రమేష్‌ ఆస్పత్రిపై కేసులు పెట్టకుండా ఉంటే.. చంద్రబాబు నోట టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారనే మాట వచ్చేది కాదేమోనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కానీ ప్రభుత్వం చట్టం ఎవరికైనా ఒక్కటే అనే మాదిరిగా.. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో కంపెనీ యజమానులను జైలుకు పంపింది. ఇదే చంద్రబాబుకు నచ్చడం లేనట్లుగా ఉంది.

మూడు రాజధానులను ప్రకటించడం ద్వారా అమరావతి రైతులపై ప్రభుత్వం దాడి చేసినట్లుగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. పైగా మూడు రాజధానులు అనే దాడి వల్ల ఆయన చెబుతున్నట్లుగా అమరావతి రైతులే కాదు.. ఆయన, ఆయన అనుంగులు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని అందరికీ తెలిసిపోయింది. ఎంతో ముందు చూపుతో నిర్మించుకున్న ఆర్థిక కలల సౌధం కలగా మిగిలే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఈ మాత్రం భయపడడంలో అర్థం ఉందంటున్నారు.

ఈ రెండు భయాలు తప్పా.. చంద్రబాబుకు మరే భయం లేదు. కానీ చంద్రబాబును చూసి తాము భయపడుతున్నామని రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేయదల్చిన మూడు రాజధానులను ఇంకా ఏన్నాళ్లు కోర్టుల ద్వారా బాబు అడ్డుకుంటారేమోనన్న భయం ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులను వెంటాడుతోందట. వ్యవసాయం చేద్దాంటే నీళ్లు లేక, పని దొరక్కా తాతల కాలం నుంచి పొట్ట చేతపట్టుకుని వలసలు పోతున్న తమ బతుకులు ఇకనైనా మారాతాయని కలలు కంటున్న వారికి ఆ కల నెరవేరడం ఆలస్యం అవుతుండడంతో భయం మొదలైంది.

మా తాత పూరిగుడిసెలోనే ఉన్నాడు. మా నాన్న అద్దె కొంపలోనే ఉన్నాడు. నేను అద్దె ఇంట్లోనే కాలం వెల్లదీస్తున్నా.. నా పిల్లలైనా సొంత ఇంట్లో ఉండాలని కోరుకున్న పేద, మధ్యతరగతి ప్రజల్లో చంద్రబాబు అంటే భయం మొదలైంది. అర్హులైన 30 లక్షల మందికి ఏ సిఫార్సు, లంచం లేకుండా ఇంటి స్థలం ఇస్తుంటే.. కోర్టుల ద్వారా చంద్రబాబు ఎప్పటి వరకు అడ్డుకుంటాడోనన్న భయం వేంటాడుతోంది. సొంత ఇంటి స్థలం కలగానే మిగిలిపోతుందేమోనన్న ఆందోళన చంద్రబాబు వలన 30 లక్షల కుటుంబాల్లో నెలకొంది.

చదువుకుంటే పేదరికం పోతుందని అందరూ చెబుతున్నారు. నేను ఎలాగూ చదవుకోలేకపోయా. ఈ పని నా పిల్లలు చేయకూడదు. వారి భవిష్యత్‌ బాగుండాలి. కానీ వేలకు వేలు ఫీజులు కట్టి ఇంగ్లీషు కాన్వెంట్‌లకు పంపలేని తల్లిదండ్రుల్లో జగన్‌ రాకతో ఓ ఆశ. ప్రభుత్వ బడుల్లోనే ఇంగ్లీష్‌ మీడియం, నాణ్యమైన మధ్యాహ్నం భోజనం. పిల్లల భవితకు భరోసా దక్కిందనుకుంటే.. ఇంగ్లీష్‌ వద్దు.. తెలుగులోనే చదవాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతున్నారు. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఆ అడ్డు తొలుగుతుందా..? లేదా..? అనే భయం ఇప్పుడు పేద, మధ్య తరగతి తల్లిదండ్రులను వెంటాడుతోంది. పిల్లల బతుకులు మారుతాయని ఆశిస్తున్న వారికి.. చంద్రబాబు రూపంలో అడ్డు ఎక్కడ వస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది.

కోట్లాది మంది సామాన్యుల ఆశలపై దాడులు చేస్తున్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ పనితీరును చూసి భయపడడంలో ఆశ్చర్యం లేదంటున్నారు. జగన్‌ పరిపాలనతో ఎక్కడ తన కుమారుడికి భవిష్యత్‌ లేకుండాపోతుందేమోనన్న ఆందోళన ఇప్పటికే మొదలైందాయో. అలాంటిది చంద్రబాబు ఆ మాత్రం భయపడడంలో అర్ధం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.