Idream media
Idream media
నలభై ఏళ్ళ ఇండస్ట్రీ, పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిత్వం, మరో పన్నెండేళ్లు ప్రతిపక్ష నేత అని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించడం అంటే పార్టీ పరంగా ఆత్మహత్యసదృశ్యం లాంటిదే అని పేర్కొంటున్నారు.
మరీ సిల్లీ కారణాలు చెప్తోన్న టీడీపీ
నీలం సాహ్ని మొన్నటి వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సలహాదారుగా ఉన్నారంటా..! ఆల్ ఇండియన్ సర్వీస్ అధికారిగా నీలం సాహ్నికి మంచి పేరు ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను పకడ్బందీగా అమలు చేయడం, ప్రభుత్వానికి అధికారులకు వంతెనలా ఉంటారనే అభిప్రాయం ఉంది. ఈ కారణాలే ఆమెను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేశాయి. రాష్ట్ర విభజన సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉండడంతో ఉద్యోగ విరమణ కాగానే సీఎం జగన్ తన సలహాదారుగా పెట్టుకున్నారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఇదే పని చేశారు.
ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నది అటు ప్రభుత్వం… ఇటు ఎన్నికల కమిషనర్ నిర్ణయించారు. దీనికి తోడు తిరుపతి ఉప ఎన్నికలు ఉండడంతో ఏయే తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బంది ఉండదో ఎస్ఈసీ చర్చించి, నిర్ణయం తీసుకుంటే… అది కూడా ప్రభుత్వానికి ముందే ఎలా తెలిసింది అని టీడీపీ ప్రశ్నించడం వింతగా ఉంది. తమ ఏజెంట్ నిమ్మగడ్డ లాగే ఎన్నికల ప్రక్రియ పై ప్రభుత్వం తో చర్చింకుండా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ ఉద్దేశం కావొచ్చు.
Also Read : పరిషత్ ఎన్నికల బహిష్కరణ పై బాబు చెప్పిన కారణాలు ..
అసలు ఎన్నికల్లో పోటీ చేస్తే కదా ఎలా జరుగుతాయో తెలిసేది. జోస్యం చెప్పినట్లు పోటీ చేయకముందే.. పోటీ చేస్తే అధికార దుర్వినియోగం జరుగుతుంది.. రాజ్యాంగం అపహాస్యం అవుతుందని చంద్రబాబు చెప్తుండడం విచిత్రంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఉన్న కాస్త పరువు పోవడం ఇష్టం లేకే చంద్రబాబు కుంటి సాకులు చెప్తున్నట్లుంది. చంద్రబాబు నియమించిన ఎన్నికల అధికారి ఉంటేనే మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేపు అసెంబ్లీ ఎన్నికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఫలానావారు ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని చెప్పి బహిష్కరిస్తారా? అని కూడా అడుగుతున్నారు.
మొన్నటి స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం చావుదెబ్బ తినింది. రేపు పరిషత్ ఎన్నికల్లో కూడా ఇంతకన్నా భిన్నమైన ఫలితం రాదని, ఈమాత్రం దానికి డబ్బు ఎందుకు వృధా చేసుకోవాలని అనే ప్రధాన ఉద్దేశంతోనే చంద్రబాబు ఎన్నికలకు టాటా చెప్పారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో నయాపైసా కూడా బయటకు తీయడానికి ఇష్టపడటం లేదు. ఓడిపోయే దానికి ఖర్చు పెట్టడం ఎందుకు అనే భావన వారిలో ఉంది.
వీటికి సామాధానం చెప్పండి బాబు..?
ఎన్నికలు ప్రశాంతంగా బాగా జరిగాయి అని స్వయంగా మీ నిమ్మగడ్డ చౌదరి చెప్పాడు. తాడిపత్రి మున్సిపాలిటీ లో(టీడీపీ 18 వార్డులు, వైసీపీ 16 వార్డులు గెలిచాయి) జగన్ అనుకోని ఉంటె వైసీపీ గెలిచేది, వాళ్ళ నాన్న లాగా న్యాయంగా వెళ్ళాడు జగన్ కాబట్టి నేను చైర్మన్ అయ్యాను అని స్వయంగా టీడీపీ తాడిపత్రి చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు.
ఈ ఎన్నికలను బహిష్కరించి తమ ఓటు బ్యాంకును బీజేపీ వైపు మళ్లించి కొన్ని సీట్లు గెలిపించగలిగితే మోడీ – అమిత్ శాలు కరుణించి తమ పాదాలవద్ద ఆశ్రయం కల్పిస్తారనే ఆలోచన కూడా చంద్రబాబుకు వచ్చి ఉండవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు ను రక్షించే అదృష్ట శక్తులు కూడా ఏమీ కనిపించడం లేదు.
ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యకపోతే ఇక అసెంబ్లీ ఎన్నికలవరకు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు ఉండవు. ఈ లోపల తెలుగుదేశం బీజేపీలో కలిసిపోయే అవకాశం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్షంగా బీజేపీ-జనసేన కూటమి పోటీ చేస్తుందనే ఊహాగానాలు ఇప్పటి నుంచే వినిపిస్తున్నాయి.
Also Read : పరిషత్ ఎన్నికల బహిష్కరణ ఎఫెక్ట్.. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా