iDreamPost
iDreamPost
ఒక జాతి ఔన్నత్యాన్ని చాటడంలో మాతృభాష కీలకం. ముఖ్యంగా తెలుగు భాష గొప్పదనాన్ని గురించి ప్రతిసారి కొత్తగానే చెబుతుంటారు కవులు. రాజకీయ పార్టీలు కూడా ఇతర విషయాల్లో ఎలా ఉన్నా భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం, ముఖ్యంగా మాతృభాషను కాపాడుకోవడానికి గిడిగురామ్మూర్తి పంతులు చేసిన కృషిని గుర్తు చేసుకుని, ఆయనకు నివాళులర్పించడం సహజంగా జరుగుతుంది.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, సీయం వైఎస్ జగన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళాణ్‌తో సహా అందరూ గిడుగుకు నివాళులర్పించారు. అయితే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుకి మాత్రం ఆ తీరక దొరకలేదు. ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషు భాషలకు సమ ప్రాధాన్యమిస్తూ పాఠశాల స్థాయిలోనే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడితే గగ్గోలు పెట్టి, భాషాభిమానం అంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు అండ్ బృందం కనీసం మాతృభాషా దినోత్సవం రోజున గిడుగు రామ్మూర్తికి నివాళులు కూడా అర్పించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ్ర
ప్రస్తుతం కరోనా కారణంగా భారీగా మాతృభాషా దినోత్సవం చేసేందుకు అవకాశం లేదు. దీంతో రాజకీయ నేతలంతా పత్రికా ప్రకటనలు గానీ, ట్వీట్ల ద్వారాగానీ తమతమ ఉద్దేశాలను ప్రతి నిత్యం ప్రజల ముందుకు తెస్తున్నారు. అదే విధంగా తెలుగు భాషా దినోత్సవంపై కూడా నాయకులంతా స్పందించారు. కానీ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నాయుడులు అయితే ట్వీట్లే జీవితంగా మసలుతున్నారు. అటువంటప్పుడు కనీసం ట్విట్టర్‌లో కూడా మాతృభాషకు సంబంధించి చిన్న మెస్సేజ్ కూడా వారు పెట్టకపోవడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుకు తెలుగు భాష అంటే ఎంతో మక్కువ అని, ఆయన స్థాపించిన పార్టీకి జాతీయ అధ్యక్షులు, కార్యదర్శులుగా ఉన్న తండ్రీకొడుకులిద్దరూ కనీసం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలైనా తెలపకపోవడం వారు చెప్పే మాటలకు, చేసే పనులకు ఎంత వ్యత్యాసం ఉంటుందో అర్ధమవుతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రధాన మంత్రే స్వయంగా స్పందించినా గానీ, రాష్ట్రంలో మూడు సార్లు సీయంగా పనిచేసి, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.