iDreamPost
android-app
ios-app

Chandrababu – Vizag Steel : బాబు నోటా అఖిలపక్షం మాట..!

  • Published Nov 01, 2021 | 2:14 PM Updated Updated Nov 01, 2021 | 2:14 PM
Chandrababu – Vizag Steel : బాబు నోటా అఖిలపక్షం మాట..!

విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలన్నారు. తన రహస్యమిత్రుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో చేసిన అఖిలపక్షం డిమాండునే మర్నాడు చంద్రబాబు అందుకోవడం గమనార్హం.

రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కొన్నాళ్లుగా ఈ తరహా వైఖరిని అవలంభిస్తున్నాయి. ఒకరి స్టేట్మెంట్ కు కొనసాగింపుగా మరొకరు ప్రకటన ఇవ్వడం, ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయింది. పరిషత్ ఎన్నికల్లో తాము అసలు పోటీయే చేయడం లేదని చెప్పిన టీడీపీ.. జనసేనతో అనైతిక పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా పోటీ నుంచి తప్పుకొని బీజేపీకి లైన్ క్లియర్ చేసింది. రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతుంటే సడన్ గా పవన్ తెరపైకి వచ్చి అవును అంటూ వారికి మద్దతుగా స్టేట్మెంట్ ఇస్తారు. జనసేన అధినేత ఏదైనా మాట్లాడితే ఇదిగో ఇలా బాబుగారు గొంతు సవరించుకుంటారు.

వైఎస్సార్ సీపీది ద్వందవైఖరి అట..

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ విషయంలో వైఎస్సార్ సీపీ ద్వంద వైఖరి అవలంభిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేశ పడిపోయి నిన్నటి పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని గుర్తుకు తెచ్చారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కర్త, కర్మ, క్రియ అయిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా వీరిద్దరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండడం విచిత్రం. వైఎస్సార్ సీపీది ద్వంద వైఖరి అంటున్న చంద్రబాబు ఈ విషయంపై తానెందుకు సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు?

Also Read : Vizag Steel Plant ,Pawan Kalyan -వైజాగ్ స్టీల్ ప్లాంట్: డిల్లీలో సై, వైజాగ్ లో నై అంటే ఎలా పవనూ..?

రైతులు అవస్థలు పడుతున్నారని మొసలి కన్నీరు..

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో రైతులకు అవస్థలు పడుతున్నారని చంద్రబాబు తెలిపారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, సెస్ తగ్గించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోళ్లు మొదలవుతుంటే అప్పుడే నిర్లక్ష్యం, రైతులు అవస్థలు పడిపోవడం ఈయన ఎక్కడ గమనించారో? రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దానిపై విచారణ జరిపించాలని డిమాండు చేస్తే జనం నిజంగా అవినీతి జరిగిందని అనుకుంటారని బాబు ఎత్తుగడ. తన హయాంలో పెట్రోల్, డీజిల్ పై ఒకేసారి లీటరుకు నాలుగు రూపాయలు సెస్ పెంచిన చంద్రబాబు ఇప్పుడు తగ్గించమని డిమాండు చేయడం ద్వంద్వ వైఖరి కాదా?

వైఎస్సార్ సీపీని ఓడించాలని పిలుపు..

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఓటర్లు ఏకమై వైఎస్సార్ సీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని బాబు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. 2019 తర్వాత ఏ ఎన్నిక వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుంటే టీడీపీ ఓడిపోతోంది. ప్రజాబలం లేక కొన్నిచోట్ల పోటీయే చేయడం లేదు. అలాంటిది ఆ పార్టీని ఓడించండీ అని పిలుపు ఇచ్చి ఎవరిని గెలిపించమని కోరుతున్నారో? అసలు ఎన్నికలంటేనే భయపడిపోతున్న టీడీపీ, బీజేపీ, జనసేన ఇలాంటి స్టేట్మెంట్ లకు, కుమ్మక్కు రాజకీయాలకు పరిమితమై ప్రజల్లో తమ పార్టీల పరువును దిగజార్చు కుంటున్నారు. ఇంతకన్నా బహిరంగంగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగితే ఓటర్లు ఎవరి పక్షం వహిస్తారో తేలిపోతుంది.

Also Read : Steel Plant – Pawan Kalyan : అఖిల పక్షం సరే.. కేంద్రాన్ని ప్రశ్నించరేమి?