ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని మరో మిలియన్ మార్చ్ తరహాలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల సరూర్‌నగర్‌లో నిర్వహించాలని నిర్ణయించిన బహిరంగసభకు పోలీసులు అనుమతివ్వకున్నా, కోర్టు ద్వారా అనుమతి పొంది సభకు భారీగా జన సమీకరణ జరిపిన నేపథ్యంలో దీనికి కూడా పెద్దసంఖ్యలో జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అఖిలపక్ష నేతలు కూడా దీనికి మద్దతు తెలిపిన నేపథ్యంలో, కారి్మకుల కుటుంబ సభ్యులతోపాటు ఆయా పారీ్టల నుంచి భారీగా కార్యకర్తలు తరలేలా ఇటు జేఏసీ, అటు పారీ్టలు సం యుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి గురువారం జేఏసీ నేతలు వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. ఉస్మానియా విద్యార్థులు కూడా ఈ సభకు తరలేలా వారితోనూ చర్చిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉస్మానియా విద్యార్థులతో జేఏసీ నేతలు సమావేశం కానున్నా రు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి.
ఆర్టీసీ విషయంలో ఇటు ప్రజలతో పాటు అటు కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారని, ఒకదశలో కోర్టుకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారని ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. అధికారులకు ఏమాత్రం చీమూనెత్తురున్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. 9 గంటలు మంత్రులతో చర్చించారు. 9 నిమిషాలు మాతో చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యేది కదా.. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఈ నెల 9న నిర్వహించే చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలి.’అని కోరారు.