లాక్ డౌన్ వల్ల ధియేటర్లు మూతబడి కొత్త సినిమాల కరువులో ఉన్న మూవీ లవర్స్ కు కొంత ఊరట కలిగించేలా విశాల్ ‘చక్ర’ ట్రైలర్ తో ముందుకు వచ్చాడు. నిజానికి గత రెండు నెలలుగా కనీసం చెప్పుకోదగ్గ ఏ స్టార్ హీరో టీజర్ సైతం విడుదల కాలేదు. అందుకే చక్ర మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందాకే దీని తెలుగు వర్షన్ ని ఆన్ లైన్ ద్వారా దగ్గుబాటి రానా రిలీజ్ చేశాడు. ఇక ఇందులో విషయానికి వస్తే అభిమన్యుడు తరహాలో సైబర్ క్రైమ్ ని ప్రధానాంశంగా తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో అంతుచిక్కని రీతిలో ఒకేసారి దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఆచూకి దొరక్కుండా తప్పించుకుంటున్న హంతకుడు టెక్నాలజీ సాయంతో ఎక్కడో దూరం నుంచి ఆపరేట్ చేస్తుంటాడు.
దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పూనుకున్న ఆఫీసర్ విశాల్ కు ప్రతిది సవాల్ గా మారుతుంది. ఈ క్రమంలో అతనికి అండగా ఉంటుంది కొలీగ్ శ్రద్ధ శ్రీనాథ్. మరి ఇంత ఛాలెంజింగ్ గా మారిన ఆ దొంగల ముఠాను, దాని వెనుక ఉన్న అపరిచిత నాయకుడిని హీరో ఎలా పట్టుకున్నాడు అనేదే చక్ర కథ. ట్రైలర్ ఇంటరెస్టింగ్ గా ఉంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. మరో హీరొయిన్ రెజినాను ఇందులో చూపించలేదు. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం మంచి టెక్నికల్ వాల్యూస్ తో కనిపిస్తోంది. బాలసుబ్రమనియం ఛాయాగ్రహణం దీనికి బాగా దోహద పడింది.
రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాకుండా విశాల్ ఇలాంటి డిఫరెంట్ జానర్ లో కొనసాగడం మంచి పరిణామమే. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని ఆధారంగా చేసుకుని నడిచే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో డ్యూయెట్స్ లాంటివి ఆశించకూడదు కాబట్టి చక్రలో కూడా వాటిని అవకాశం ఇచ్చినట్టు లేరు. హీరో హీరొయిన్ తప్ప అందరూ తమిళ నటీనటులే ఉన్నారు. సస్పెన్స్ లో ఉంచిన విలన్ ని మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. రోబో శంకర్, కేఆర్ విజయ, మనోబల తదితరులు ఇతర పాత్రలు పోషించిన చక్ర ఎప్పుడు విడుదలవుతోందో మాత్రం ఎవరూ చెప్పలేరు. ఓటిటిలో రావోచ్చనే టాక్ కొద్దిరోజులుగా నడుస్తోంది కాని విశాల్ నేరుగా దీని గురించి క్లారిటీ ఇవ్వడం లేదు.
Link Here @ http://bit.ly/3g25ky9