iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా రావలసిన చట్టబద్ధ హామీలకు కేంద్రం మొండి చెయ్యి చూపింది. పార్లమెంటు సమావేశాల సంధర్భంగా మంగళవారం లొక్ సభలో తెలుగుదేశం యం.పి కేశినేని నాని లిఖితపూర్వంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర హొంశాఖ సహాయక మంత్రి నిత్యానందరాయి సమాధానం ఇస్తూ హమీలు లాభదాయకం కాదు, ఇప్పుడు సర్ధుబాటు చేయ్యలేము అంటు రాష్ట్రం పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లారు.
విభజన చట్టంలోని 13వ షెడ్యుల్ ప్రకారం హామీగా వచ్చిన కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు లాభదాయకం కాదని తేలింది అంటూ జవాబు ఇచ్చారు, అలాగే దుగరాజపట్నం పోర్టుకి సమీప రేవుల నుండి పొటీ ఉన్నందున లాభదాయకం కాదని మరొక చోట ప్రత్యామ్నాయ స్థలం ప్రతిపాధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఉన్న అసెంబ్లీ స్థానాలని 175 నుండి 225 కి పెంచుకునే అవకాశం కూడా లేదని 2026 తరువాత చేపట్టే జనాభా లెక్కలను చూసి అందులో అవసరమైన వివరాలు తీసుకునే వరకు రాష్ట్రాలలోని అసెంబ్లీ సీట్లు సంఖ్యను మార్చటం సాధ్యం కాదని తెగేసి చెప్పారు.
2015-20కి మధ్య రాష్ట్రానికి రెవెన్యులోటు కింద 22,113 కోట్లు ఇవ్వాలని 14వ ఆర్ధిక సంఘం సూచించగా 2015-19 వరకు 19,613 కోట్లు ఇప్పటికే ఇచ్చినట్లు తెలిపారు. విభజన చట్టం లోని అత్యధిక హామీలు ఇప్పటికే అమలు చేశాము అని, కోన్ని విషయాలలొ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఆలస్యం జరుగుతుంది అని, ఇరువురి తొ మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వివిధ విద్యా సంస్థల ఏర్పాటుకు 1,63,834 కోట్లు ఇచ్చామని చెప్పారు, విశాఖ పట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. గత 5ఏళ్ళలో రెవెన్యు లోటు భర్తికి గాను 3,979.50 కోట్లు, 7 వెనకబడిన జిల్లాల అభివృద్దికి 1,050 కోట్లు, రాజధాని మౌళిక వసతుల అభివృద్దికి 2,500 కోట్లు, పొలవరం జాతీయ ప్రజెక్టుకు 6,764.70 కోట్లు, ప్రత్యేక సాయం కింద 15.81 కోట్లు కలిపి 14,310.01 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి గడిచిన 5 ఏళ్ళలొ ఇచ్చినట్టు చూపారు.
కడప ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటూ కడప వేదికగా దీక్షకు దిగిన సి.యం రమేష్, దుగరాజపట్నం పోర్టు హామీ కేంద్రం నిలబెట్టుకోవాలి అని మాట్లాడిన సుజనా చౌదరి లాంటి చంద్రబాబు సన్నిహితులు నేడు బి.జే.పి లొ ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా రావలసిన హామీల విషయం లో సాధించే ప్రయత్నం చేయకపొగా పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం జరుగుతుంటే పల్లెత్తుమాట మాట్లాడకపొవటం గమనార్హం.