iDreamPost
android-app
ios-app

ఏపీలో అమిత్‌షా రాజకీయేతర పర్యటన

ఏపీలో అమిత్‌షా రాజకీయేతర పర్యటన

అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఈ పర్యటన పూర్తిగా రాజకీయాలకు అతీతంగా సాగింది. కుటుంబంతో కలసి ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్‌షా తొలిసారి శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్నారు. మల్లికార్జునడు సేవలో కుటుంబంతో కలసి పాల్గొన్నారు. అమిత్‌షాకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిశ్రీనివాస్, కర్నూలు జిల్లా ఇంఛార్జి మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌లు స్వాగతం పలికారు.

ఉదయం ఢిల్లీ నుంచి కుటుంబంతో కలసి బయలుదేరిన అమిత్‌షా హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వచ్చారు. మల్లికార్జునుడి దర్శనం తర్వాత అమిత్‌షా బ్రమరాంభ అతిథి గృహంలో బస చేయబోతున్నారు. అక్కడే కుటుంబంతో కలసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఆ తర్వాత 2:45 గంటలకు తిరుగుపయనమవనున్నారు. రోడ్డు మార్గాన సున్నిపెంటకు, అక్కడ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు, అక్కడ నుంచి వాయి మార్గం ద్వారా 3:50 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. అమిత్‌ షా పర్యటన ఆసాంతం రాజకీయాలకు అతీతంగా సాగింది.

Also Read : నేతల కోసం ఏపీ బీజేపీ ప్రత్యేక వేట