iDreamPost
android-app
ios-app

నడికుడి-శ్రీకాళహస్తి రైలుకి కేంద్రం తీపి కబురు

నడికుడి-శ్రీకాళహస్తి రైలుకి కేంద్రం తీపి కబురు

గుంటూరు జిల్లాలో వెనుకబడిన పలనాడుతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు రైలు మొహం ఎరుగని ప్రజలు ఎప్పటి నుండే ఎదురు చూస్తున్న ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గానికి ఈసారి కేంద్రబడ్జెట్ లో 1,918 కోట్లు కేటాయించారు. 308 కిలోమీటర్లు కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఈ మార్గం మొత్తం అంచనా వ్యయం 2,289 కోట్లు. కాగా ఇప్పటికే గత బడ్జట్ల లో కేటాయించిన దానిలో ఇప్పటికే 700 కోట్లరూపాయలు ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రైలు మార్గంలోని మొదటిదశ ఫేజ్-1 నిర్మాణం పూర్తి చేసుకొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జట్లో ఈ మార్గానికి ప్రాధాన్యత ఇచ్చి 1,918 కోట్లు కేటాయించడం తో మొదట అనుకున్నవిధంగా 2022 నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. దింతో దశాబ్దాల తమ రైలు ప్రయాణం కల సాకారమౌతుందని ఆ ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డిల్లీ-చెన్నై, హౌరా-చెన్నై రైల్వే లైన్ కి ప్రత్యామ్నాయంగా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అభివృద్ధికి నోచుకోని బాగా వెనుకబడిన ప్రాంతాలని కలుపుతూ ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన చాలారోజుల నుండి ఉన్నప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం పట్టు పట్టి అప్పటి యూపీఏ ప్రభుత్వం చేత నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గానికి అన్ని పరిపాలనా అనుమతులు సాధించారు. అనంతరం ఈ ప్రాజెక్టు ని రైల్వేబడ్జెట్ లో చేర్చడంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రాజెక్టు సర్వే, భూ సమీకరణ కూడా పూర్తి అయినప్పటికీ తరువాత వచ్చిన ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కాస్త ఆలస్యం అయ్యింది.

Read Also: నడికుడి To శ్రీకాళహస్తి వెళ్లే రైలు మరి కొద్ది సమయంలో…

ఇటీవలే నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం మొదటి దశ ఫేజ్-1లో నిర్మాణం పూర్తి చేసుకున్న గుంటూరు జిల్లాలోని శావల్యపురం నుండి పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ వరకు ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా శావల్యపురం రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలు ఇంజన్ వేల్పూరు, రొంపిచెర్ల, కుంకలగుంట, పెద్ద నెమలిపురి స్టేషన్ల మీదగా పిడుగురాళ్ల వరకు ఈ ట్రైల్ రన్ ని అధికారులు నిర్వహించారు.

దక్షిణ మధ్య రైల్వే జొన్ పరిధిలో న్యు డిల్లీ-చెన్నై, హౌరా-చెన్నై రైల్వే లైన్ కి ప్రత్యామ్నాయం గా ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణం చేపట్టారు. 2010-11 లో 2,289 కోట్ల అంచాన వ్యయంతో ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 2022 నాటికి పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంటూరు-సికింద్రాబాదు మార్గంలో ఉన్న పిడుగురాళ్ల నుండి గూడూరు-కాట్పాడి లైన్ లోని వెంకటగిరి వరకు మొత్తం 308 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది. కాగా ఈ ప్రాజెక్ట్ మొదటిదశ పిడుగురాళ్ల నుండి శావల్యపురం వరకు నిర్మాణం పూర్తి అవ్వడంతో ఇప్పుడు లైన్ విద్యుద్దీకరణ పనులు మొదలుపెట్టబోతున్నారు.

Read Also: రైలు – ప్రజా జీవితం

గుంటూరు-సికిందరాబాద్ రూట్ లో ఉన్న నడికుడి నుండి మొదలయ్యే ఈ రైల్వే లైన్ పిడుగురాళ్ల, నకరెకల్, రొంపిచెర్ల, శావల్యపురం, వినుకొండ, గుండ్లకమ్మ, దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, దూబకుంట, ఆత్మకూరు, ఒబులయ్యపల్లె, రాపూర్ మీదుగా వెంకటగిరి స్టేషన్ లోని గూడూరు-రేణిగుంట లైన్ లో కలుస్తుంది. ఈ మార్గం నిర్మాణంతో చెన్నై హైదరాబాద్ ల మధ్య 120 కిమీ దూరం తగ్గడంతో పాటు రెండు గంటల సమయం ఆదా అవుతుంది. దీనితోపాటు ప్రకృతి విపత్తులు, తుఫానుల సమయంలో ఈ రైలుమార్గం మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetholiganbetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis