iDreamPost
android-app
ios-app

Balayya Unstoppable : అన్ స్టాపబుల్ లో సెలబ్రిటీల ప్రవాహం

  • Published Nov 01, 2021 | 9:19 AM Updated Updated Nov 01, 2021 | 9:19 AM
Balayya Unstoppable : అన్ స్టాపబుల్ లో సెలబ్రిటీల ప్రవాహం

ఇంకో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న బాలకృష్ణ సెలబ్రిటీ టాక్ షో అప్పుడే అంచనాలు పెంచేస్తోంది. నిన్న మంచు ఫ్యామిలీతో చేసిన ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో బాగా వైరల్ అవుతోంది. అందులో బాలయ్య బాడీ లాంగ్వేజ్, గెటప్, వేసిన ప్రశ్నలు, కొన్నింటికి మోహన్ బాబు తడబడుతూ సమాధానం చెప్పడం, దాటవేయడం లాంటివి ఆకట్టుకున్నాయి. రెగ్యులర్ టాక్ షోలకు భిన్నంగా ఇది సాగిందనే టాక్ అయితే వచ్చింది. మరి ఫుల్ ఎపిసోడ్ చూశాకే రియల్ ఫీడ్ బ్యాక్ వస్తుంది కానీ మొత్తానికి అల్లు అరవింద్ వేసిన స్కెచ్ బాగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే రాబోతున్న సెలబ్రిటీల లిస్టు చాలా టెంప్టింగ్ గా ఉంది మరి.

మోహన్ బాబుతో అయ్యాక నెక్స్ట్ లిస్ట్ లో న్యాచురల్ స్టార్ నాని, రానా, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నారట. ఆ మధ్య నాగబాబు పేరు వినిపించింది కానీ అది నిజం కాదని సమాచారం. సో పైన చెప్పినవాళ్లలో ఎవరు వచ్చినా మంచి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా బాబాయ్ అబ్బాయి బాలయ్య తారక్ ల కాంబినేషన్ బెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇద్దరూ ఒకే వేదిక లేదా ముఖాముఖీ చేసి చాలా కాలం అయ్యింది. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఈ కలయిక కోసం ఎదురు చూస్తున్నారు. సినిమాలో అయితే సాధ్యమయ్యేలా కనిపించడం లేదు కానీ ఇప్పుడు దానికి అన్ స్టాపబుల్ వేదిక అయితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది

ప్రస్తుతం దీని ఫస్ట్ సీజన్ షూటింగ్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే యాక్షన్ ఎంటర్ టైనర్ ని మొదలుపెడతారు. అఖండ విడుదలకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. డిసెంబర్ 2 అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. టీజర్ ను ముందు అనౌన్స్ చేసి ఆ తర్వాత రిలీజ్ డేట్ చెబుతారేమో. డిస్ట్రిబ్యూటర్లు కూడా కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత మూడు సినిమాలు డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడీ టాక్ షో, అఖండల మీదే ఉన్నాయి. పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏ మేరకు నిలబెట్టుకుంటాయో చూడాలి

Also Read : Radhe Shyam : ప్రభాస్ టీమ్ మేలుకోవాల్సిన టైం వచ్చేసింది

jojobetjojobet girişJojobet Casino Sitesicasibomjojobetmarsbahismarsbahis güncel girişjojobet giriş adresi