వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. వందల్లో సర్పంచ్ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వానికి సవాల్ విసిరాం… పర్లేదు టీడీపీ కోలుకుంది.. అని తమ జబ్బలు తామే చరుకుని ఒక్కరోజు కాలేదు… తెలుగుదేశం దుమ్ములేపింది.. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలే తార్కాణం అని తమ ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుని, చానెళ్లలో కథనాలు వేయించుకుని ఒక్కరోజు గడవలేదు. చంద్రబాబు మళ్లీ భ్రమల్లోంచి బయటకు వచ్చినట్లున్నారు.
మసి బూసి మారేడు కాయ చేయడం, ఆత్మవంచనతో సంతోషించడం కుదరనిపని అని అర్థం అయినట్లుంది. అలాగని తమ ఓటమిని ఒప్పుకునే నిజాయితీ, ధైర్యం లేదు. అలా ఒప్పుకుంటే కార్యకర్తల్లో మనోధైర్యం దెబ్బతింటుంది. అదే జరిగితే పార్టీ ఎటు వెళుతుందో అర్థం కాదు. అందుకే తమ బలహీన తను, ఓటమిని అహంకారం మాటున దాచేసి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం పై దాడికి దిగారు చంద్రబాబు. ఎన్నికలు జరిగిన తీరే బాలేదని, ఇలాంటి ఎన్నికలు కనీవినీ ఎరుగనివని, అంతా భయానక వాతావరణంలో జరిపించి ఏకగ్రీవాలు చేసుకున్నారని వాపోతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఏకగ్రీవాలన్నీ అక్రమాలేనని, అభ్యర్థులను భయపెట్టి వారిని తమవైపు తిప్పుకుని విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారని, ఇదంతా అప్రజాస్వామికమని ఆ లేఖలో ఆక్రోశించారు. పలు చోట్ల మళ్లీ ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరారు.
వాస్తవానికి గతంలో తెలుగుదేశం ఏకగ్రీవంగా గెలుచుకున్న సర్పంచుల సంఖ్యకన్నా ఈసారి తెలుగుదేశం ఎక్కువ స అఖ్యలో ఏకగ్రీవంగా సర్పంచులను గెలిపించుకున్నది. ఈ వాస్తవాన్ని గ్రహించలేని చంద్రబాబు యథావిధిగా కేంద్రాని కి రాశారు, ఆయన ఆవేదనకు కారణమేమిటీ అని చూస్తే హేమాహేమీలకు దెబ్బడిపోయింది…!!!
తెలుగుదేశంలో ఉద్దండపిండాలుగా చెప్పుకుంటున్న పలువురు సీనియర్ నాయకుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది. వ్యూహరచనలో తిరుగులేదని చెప్పుకునే యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమల నియోజకవర్గాల్లో దాదాపు 90 శా తానికి పైగా సర్పంచి స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు.ఇక స్టార్ బ్యాట్స్ అని చెబుతున్న టెక్కలి ఎమ్మెల్యే,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి తన స్వగ్రామం నిమ్మా డ తప్ప పెద్దగా- దక్కిందేమీ లేదు. మాచర్లలో అయితే 78 సర్పంచుల్లో 74 వరకూ రూలింగ్ పార్టీ అభ్యర్థులే గెలచారు. ఇలా ఎక్కడ చూసినా దాదాపుగా ఇదే ఫలితాలు వచ్చాయి.
తెలుగుదేశంలో పెద్దనాయకులు, మంత్రులుగా చేసిన వాళ్లు కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో జగన్ ప్రజాదరణ ముందు నిలవలేకపోయారు. తాము వందల పంఖ్యలో సర్పంచులను గెలిపించుకున్నాం అని చంద్రబాబునాయుడు. ఆయన అనుంగులు చెబుతున్నది నిజం కాదని ప్రజలకు తెలుసు. కానీ ఓటమిని అంగీకరించే అలవాటు, సంప్రదాయం చంద్రబాబుకు లేనందున ఇప్పుడు ప్లేటు ఫిరాయించి ప్రభుత్వంపై కేంద్రానికి లేఖరాసి ఓటమి ఆవమానం నుంచి రిలీఫ్ పొందడానికి చేస్తున్న ఎత్తుగడలే ఈ లేఖ అని కార్యకర్తలు సైతం ఆ భిప్రాయపడుతున్నారు