Idream media
Idream media
రాజకీయాల్లో ఒకొక్కరు ఒక్కో విషయాన్ని నమ్ముకుంటారు. రాజశేఖరరెడ్డి స్నేహాన్ని, విశ్వసనీయతని నమ్ముకుంటారు. ఆయనకి దగ్గరైన వాళ్లు దూరమైన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు Use And Throw ని నమ్ముకుంటారు. ఆయనకు దగ్గరగా ఉండడం అసంభవం. వాడుకుని విసిరేయడం ఆయన అలవాటు.
40 ఏళ్లకి పైగా ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. రాజకీయ గురువు రాజగోపాలనాయుడిని , మంత్రి అయిన తర్వాత (కాంగ్రెస్) బాబు ఏనాడూ పట్టించుకోలేదు. 1978లో నేండ్రగుంట నుంచి పాకాల వరకు (దాదాపు ఐదు కిలోమీటర్లు) బ్యానర్లు కట్టి ఇందిరాగాంధీని ఇంప్రెస్ చేసిన బాబు , ఆ తర్వాత రోజుల్లో ఆమెని బండ బూతులు తిట్టాడు. 1978లో గెలిచిన తర్వాత చంద్రగిరి ప్రజల్ని పట్టించుకోలేదు. ఫలితంగా 1983లో మీసాల రామానాయుడు అనే అనామకుడి చేతిలో ఓడిపోయాడు.
మామ మీద సవాల్ చేసి మళ్లీ మామ పంచనే చేరాడు. అప్పటికి ఎన్టీఆర్‌కి సన్నిహితంగా ఉన్న ఉపేంద్రని, పెద్దల్లుడు వెంకటేశ్వరరావుని దూరం చేశాడు. అవకాశం రాగానే ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచాడు. వెంకటేశ్వరరావుని అందలం ఎక్కిస్తానని మోసం చేశాడు. హరికృష్ణని మంత్రిని చేసినట్టే చేసి ముంచేశాడు. 1994లో సొంత తమ్ముడికే టికెట్ రాకుండా అడ్డుపడితే, ఎన్టీఆర్ ఇచ్చాడు. 2004లో తమ్ముడికి టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్‌లో చేరి రాజకీయాలకే దూరమై పోయాడు.
జూనియర్ ఎన్టీఆర్ వల్ల ప్రయోజనం ఉంటుందని కొంత కాలం అతని గ్లామర్‌ని ఉపయోగించుకున్నాడు. లోకేశ్‌కు అడ్డు రాకుండా ఆ తర్వాత పక్కన పెట్టాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పార్టీలోనే లేకుండా చేశాడు. ఓడిపోతుందని తెలిసి కూడా హరికృష్ణ కూతురికి కూకట్‌పల్లి టికెట్ ఇచ్చాడు.
బీజేపీతో ప్రయోజనం ఉంటే కలిసిపోతాడు. లేదంటే విడిపోతాడు. మోడీకి ఆకర్షణ తగ్గిందని కప్పగంతులు వేసి దెబ్బతిన్నాడు. వెంటనే తెలివిగా తన రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో కలిపేశాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో కలిసిపోతే రచ్చ చేసిన చంద్రబాబు ప్రస్తుతం నోరు మెదపడం లేదు.
కాంగ్రెస్‌ని ఏళ్ల తరబడి బూతులు తిట్టి తెలంగాణ ఎన్నికల్లో కలిసిపోయి పోటీ చేశాడు. ఎవరితోనైనా పొత్తు పెట్టుకోగలడు, విడిపోగలడు. బాబుకు కావలసింది అవకాశం, అధికారం.
ఇన్నిజరిగినా నిజాయితీ, నిబద్ధత గురించి బాబు అనర్గళంగా మాట్లాడుతాడు. అవినీతి తనకు అంటనే లేదంటాడు. బిజినెస్ మేనేజ్‌మెంట్ స్కూళ్లలో బాబు గురించి ఒక చాప్టర్ పెట్టి విద్యార్థులకు బోధించాలి. ఎందుకంటే రెండెకరాలతో లక్ష కోట్లు సంపాదించడం ప్రపంచ అద్భుతాల్లో ఒకటి కాబట్టి.
మన అదృష్టం ఏమంటే బాబు తెలివితేటల్లో లోకేశ్‌కి పదో వంతు కూడా రాకపోవడం. అదే చంద్రబాబు భయం, బాధ. నేర్చుకోవడం, ఎదగడం లోకేశ్‌కి ఇప్పట్లో సాధ్యం కావు.