Idream media
Idream media
సర్వత్రా ఉత్కంఠ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగంతో మాజీసీఎం చంద్రబాబు నాయుడుపై గతంలో 2005లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడే దర్యాప్తు చేయాలని లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయితే ఏసీబీ ఈ ఫిర్యాదును స్వీకరించకముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ వేసి తమవాదన వినాలని కోరారు.
అసలు లక్ష్మీపార్వతి కంప్లైంట్ తీసుకోకుండా మీ వాదనలు ఎలా వింటారని కోర్టు చంద్రబాబు వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.. దాంతో చంద్రబాబు వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ ను స్వీకరించిన జడ్జి ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించారు.
ఈ కారణంతోనే 2005లో చంద్రబాబు తీసుకున్న స్టే గత 14ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఈరోజుతో ఆ స్టే గడువు ముగియనున్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఏం చెప్పనుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. గతంలో ఫిర్యాదు చేసిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండడం, లక్ష్మీపార్వతి ప్రస్తుతం తెలుగు అకాడమీ చైర్మన్ గా వైసీపీలో కీలక నేతగా ఉండడం కూడా ఇప్పుడు రాజకీయంగాను ఆసక్తి రేపుతున్న అంశం.
మొత్తంమీద 14 సంవత్సరాల తర్వాత ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి సంబంధించి ఓ కేసు విచారణకు రావడం అనేది చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో పూర్వాపరాలు బయటకు తీసి విచారణ జరిపితే చంద్రబాబు అక్రమాస్తుల బయటపడి ఆయన జైలుకెళ్లక తప్పదంటూ వైసీపీనేతలు చెబుతుండగా.. చంద్రబాబు మాత్రం ఈకేసును కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ రోజు ఎలాంటి తీర్పు వస్తుందోనని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.